Anand Deverakonda: పైలట్‌ లెటర్‌.. ఆనందంగా ఉందంటూ ఆనంద్‌ ట్వీట్‌

నటుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) తాజాగా ఓ ట్వీట్ పెట్టారు. కెరీర్‌ పరంగా తాను సాధించాల్సింది ఎంతో ఉందని తెలిపారు.

Published : 23 Nov 2023 18:28 IST

హైదరాబాద్‌: నటుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఇండిగో పైలట్‌ సుభాశ్‌.. ఆనంద్ వర్క్‌ను మెచ్చుకుంటూ టిష్యూపై లేఖ రాసి అందించాడు. ‘బేబీ’ చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని.. ఆ సినిమాతో ఆనంద్‌ తన మనసు గెలుచుకున్నాడని సుభాశ్‌ పేర్కొన్నాడు. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి చిత్రాల్లో నటించమని కోరాడు. అలాగే, విజయ్ దేవరకొండకు హాయ్ చెప్పమన్నాడు. ఈ లేఖపై ఆనంద్‌ సంతోషం వ్యక్తం చేశారు. సుభాశ్‌ తన రోజును ఎంతో ప్రత్యేకం చేశాడని అన్నారు. మన వర్క్‌ను ఎదుటివ్యక్తులు గుర్తించి ప్రశంసిస్తే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేమని ఆయన అన్నారు. కెరీర్‌ పరంగా తాను ఎన్నో సాధించాలని.. అదే తన లక్ష్యమని అన్నారు.

అనుకోని అతిథిపై పవన్‌కల్యాణ్‌ ఇన్‌స్టా పోస్ట్‌.. వీడియో వైరల్‌

‘బేబీ’తో ఈ ఏడాది ఘన విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ముక్కోణ్ణపు ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్‌ భగ్న ప్రేమికుడిగా కనిపించారు. ఆయన నటనకు అంతటా ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆయన ‘గం గం గణేశా’లో నటిస్తున్నారు. ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకుడు. దీనితోపాటు వైష్ణవీచైతన్య హీరోయిన్‌గా ఆయన మరో సినిమా ఓకే చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని