దీపావళి వేడుకలు షురూ... ఒకేచోట కలిసిన స్టార్స్‌

దీపావళి వేడుకల నేపథ్యంలో సినీ తారలు సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Published : 06 Nov 2023 13:13 IST

ఇంటర్నెట్‌డెస్క్: చిత్రపరిశ్రమలో దీపావళి వేడుకలు మొదలయ్యాయి. మరో వారం రోజుల్లో రానున్న పండుగను పురస్కరించుకుని బాలీవుడ్‌, టాలీవుడ్‌ స్టార్లు తమ కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. శనివారం సాయంత్రం టాలీవుడ్‌లో జరిగిన దీపావళి పార్టీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఏర్పాటు చేసిన ఈ పార్టీలో మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. విందు భోజనాలు, గేమ్స్‌తో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను మహేశ్‌ సతీమణి నమ్రత తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఆతిథ్యం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పారు. పార్టీ అద్భుతంగా జరిగిందన్నారు.

Social Look: కేథరిన్‌ బద్ధకం..రెడ్‌ డ్రెస్సులో కృతి సనన్‌.. ప్యాలెస్‌లో మానుషి!

మరోవైపు బాలీవుడ్‌లోనూ దీపావళి పార్టీ జరిగింది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర నిర్వహించిన ఈ వేడుకల్లో సల్మాన్‌ఖాన్‌, కియారా అడ్వాణీ, ఐశ్వర్యా రాయ్‌, జాన్వీకపూర్, ఖుషి కపూర్‌తోపాటు అగ్ర, యువ నటీనటులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని