Eagle: ‘ఈగల్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఆ రెండింటిలో స్ట్రీమింగ్‌

  రవితేజ ‘ఈగల్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది.

Published : 29 Feb 2024 07:06 IST

హైదరాబాద్‌: రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (EAGLE). కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వర్‌ కథానాయికలు. నవదీప్‌ కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రవితేజ నటన, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీలు  ‘ఈటీవీ విన్‌’ (ETV Win), ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో మార్చి 1 (Eagle Streaming Date) నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. 

క‌థేంటంటే: జ‌ర్న‌లిస్ట్ న‌ళిని  (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) రాసిన ఓ క‌థ‌నంతో మొద‌ల‌వుతుందీ క‌థ‌. చిన్న క‌థ‌నమే అయినా... అది ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. ఈగ‌ల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన అంశం కావ‌డమే అందుకు కార‌ణం. మ‌న దేశానికి చెందిన ఇన్వెస్టిగేష‌న్ బృందాలు, న‌క్స‌లైట్లు, తీవ్ర‌వాదులతోపాటు ఇత‌ర దేశాలకు చెందిన వ్య‌క్తుల‌కీ టార్గెట్‌గా ఉంటుంది ఈగ‌ల్‌. స‌హదేవ్ వ‌ర్మ (ర‌వితేజ‌) ఒక్క‌డే ఈగ‌ల్‌ని ఓ నెట్‌వర్క్‌లా న‌డుపుతుంటాడు. చిత్తూరు జిల్లా త‌ల‌కోన అడ‌వుల్లోని ఓ ప‌త్తి మిల్లుతోపాటు, పోలండ్‌లోనూ ఆ నెట్‌వర్క్‌ మూలాలు బ‌హిర్గ‌తం అవుతాయి. ఇంత‌కీ ఈగ‌ల్‌కీ, త‌ల‌కోన అడవుల‌కీ సంబంధం ఏమిటి? స‌హ‌దేవ్ వ‌ర్మ ఎవ‌రు?అత‌ని గ‌త‌మేమిటి, ఈగ‌ల్ నెట్‌వర్క్‌ ల‌క్ష్య‌మేమిటి?ఈ విష‌యాల‌న్నీ జ‌ర్న‌లిస్ట్ న‌ళిని ప‌రిశోధ‌న‌లో ఎలా బ‌య‌టికొచ్చాయ‌నేది సినిమా.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని