Eagle: రవితేజ ‘ఈగల్‌’ ఫిబ్రవరికి వాయిదా.. సంక్రాంతికి ఆ నాలుగు చిత్రాలే

రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ‘ఈగల్‌’. ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

Updated : 04 Jan 2024 21:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలు (2024 sankranthi movies) సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ జాబితాలోని ‘ఈగల్‌’ (eagle) వాయిదా పడింది. సంక్రాంతి సినిమాల విడుదలపై.. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ గురువారం సమావేశమయ్యాయి. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై ఆయా నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ మేరకు ‘ఈగల్‌’ నిర్మాత తమ సినిమాని పోస్ట్‌పోన్‌ చేసేందుకు అంగీకరించారు. దీంతో, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ (జనవరి 12) (Guntur Kaaram), తేజ సజ్జ ‘హను-మాన్‌’(జనవరి 12) (Hanu Man), వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ (జనవరి 13) (Saindhav), నాగార్జున ‘నా సామిరంగ’ (జనవరి 14) (Naa Saamiranga) 2024 సంక్రాంతి బరిలో నిలవనున్నాయి.

‘సలార్‌ పార్ట్‌ 2’.. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా: విడుదల ఎప్పుడో చెప్పిన నిర్మాత

రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రమే ‘ఈగల్‌’. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు. జవనరి 13న రావాల్సిన ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్‌ పూర్తయింది. ‘ఈగల్‌ వాయిదా పడే అవకాశాలున్నాయి’ అంటూ పలువురు సినీ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టగా చిత్ర బృందం కొన్ని రోజులుగా వాటిని ఖండిస్తూ వచ్చింది. నిర్మాతలు సైతం ‘ఈగల్‌’ సంక్రాంతికి తప్పక వస్తుందని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. తాజా చర్చల అనంతరం వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నారు.

దిల్‌రాజు (Dilraju) మాట్లాడుతూ.. ‘‘ఓ సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్లు కాదు. మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయమిది. రవితేజ, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇదొక మంచి పరిణామం. ‘గుంటూరు కారం’, ‘హను-మాన్‌’ ఒకే రోజున విడుదలకాబోతున్నాయి. ఓకే తేదీన కాకుండా వేర్వేరుగా వచ్చేలా ప్రయత్నిస్తాం’’ అని అన్నారు. ‘‘15 రోజుల క్రితం నిర్మాతలతో సమావేశమై పలు కోణాల్లో చర్చించాం. అందరూ సహకరించారు. ‘ఈగల్’ ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్‌’’ అని దామోదర ప్రసాద్‌ పేర్కొన్నారు. 

రవితేజ చెప్పడంతో అంగీకరించాం: ‘ఈగల్‌’ నిర్మాతలు

‘‘రవితేజ చెప్పడంతో మా సినిమా వాయిదాకు అంగీకరించాం. ఫ్యాన్స్‌ నిరాశ పడొద్దు. సినిమా మీరంతా కాలర్‌ ఎగరేసుకునేలా ఉంటుంది’’ అని ‘ఈగల్‌’ చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని