Salaar: ‘సలార్‌ పార్ట్‌ 2’.. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా: విడుదల ఎప్పుడో చెప్పిన నిర్మాత

‘సలార్‌ 2’ విడుదలపై నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ స్పందించారు.

Published : 04 Jan 2024 09:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’ (Salaar). 2023 డిసెంబరు 22న విడుదలైన ఈ సినిమా హిట్‌గా నిలిచింది. దీని సీక్వెల్‌ కోసం ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్‌ పార్ట్‌ 2’ (Salaar Part 2) విడుదలపై నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ (Vijay Kiragandur) స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు చెప్పారు. 

నా లక్ష్యం అదే.. కథలను అలా ఎంపిక చేసుకుంటా: ప్రభాస్‌

‘‘సలార్‌ 2 స్క్రిప్టు సిద్ధమైంది. ఎప్పుడైనా చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ వీలైనంత త్వరగా షూటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటున్నారు. 15 నెలల్లో పార్ట్‌ 2ని పూర్తిచేయాలని మేమంతా నిర్ణయించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ అభిమానులందరినీ ‘సలార్‌’ ఆకట్టుకుంది. తమ అభిమాన నటుడిని చాలాకాలం తర్వాత యాంగ్రీమ్యాన్‌గా చూశారు. ఈ సినిమా వసూళ్లపై సంతృప్తిగా ఉన్నాం. కొంత నెగెటివిటీ ఉన్నా మేకింగ్‌ విషయంలో ఎవరూ విమర్శించలేదు’’ అని పేర్కొన్నారు.

‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా..

‘‘సలార్‌ 1’.. పార్ట్‌ 2కు ట్రైలర్‌లాంటిది. సలార్‌ పార్ట్‌ 2.. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుంది. యాక్షన్‌, డ్రామా, పాలిటిక్స్‌.. ఇలా పలు అంశాలు సీక్వెల్‌లో కనిపిస్తాయి. దర్శకుడు పార్ట్‌ 1లో పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. సీక్వెల్‌ చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి’’ అని విజయ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని