Rajasekhar: రాజశేఖర్‌ పాత్ర.. ఊహించని విధంగా ఉంటుంది: దర్శకుడు వక్కంతం వంశీ

నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’. ఈ సినిమాలో రాజశేఖర్‌ ఓ పాత్ర పోషించారు. దాని గురించి నితిన్‌, వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 25 Nov 2023 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో రాజశేఖర్‌ (Rajasekhar) ప్రత్యేక పాత్రకు అంగీకరిస్తారనే నమ్మకంతోనే ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man) సినిమాని ప్రారంభించామని, ఆయన్ను కలిసి కథ చెప్పగానే నటించేందుకే అంగీకరించారని దర్శకుడు వక్కంతం వంశీ ( Vakkantham Vamsi) అన్నారు. నితిన్‌ ( Nithiin) హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. శ్రీలీల (Sree Leela) కథానాయిక. రావు రమేశ్‌, హర్షవర్ధన్‌, సంపత్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్‌, వంశీ, రావు రమేశ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విశేషాలు పంచుకున్నారు.

సినిమా నాకు ఆక్సిజన్‌లాంటిది.. ఫలితాలు పట్టించుకోను: నాని

‘‘ఈ సినిమాలో రాజశేఖర్‌ సర్‌ నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన పాత్ర ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌. ఆయన స్పెషల్‌ క్యారెక్టర్‌ ప్లే చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో రాజశేఖర్‌ నటిస్తే బాగుంటుందని ముందు నుంచీ అనుకున్నాం. ఆయన ఓకే చెబుతారనే నమ్మకంతోనే చిత్రీకరణ మొదలుపెట్టాం. కానీ, ‘అంగీకరిస్తారా, లేదా?’ అనే సందేహంతోనే సంప్రదించి.. స్క్రిప్టు వినిపించాం. కథ ఆయనకు బాగా నచ్చింది. ఆయన పోషించిన పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు’’ అని అన్నారు. నితిన్‌ మాట్లాడుతూ.. ‘‘రాజశేఖర్‌ సర్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. నటుడిగా ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఆయన యాక్ట్‌ చేయడం ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్‌. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో నేను నటించిన 32వ చిత్రమిది. ఇందులో నటించిన పాత్రను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ పోషించలేదు. పలు షేడ్స్‌ ఉన్న ఇలాంటి క్యారెక్టర్‌ తదుపరి చిత్రాల్లో వస్తుందో, రాదో నాకు తెలియదు’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు