Gangs of Godavari: ఓటీటీలోకి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది.

Published : 09 Jun 2024 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ పోస్టర్‌ విడుదల చేసింది. ‘‘చరిత్రలో మిగిలిపోవడానికి లంకల రత్నం వస్తున్నాడు’’ అని క్యాప్షన్‌ పెట్టింది. తెలుగుతోపాటు తమిళ్‌, మలయాళం, కన్నడలో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులను అలరించింది. లంకల రత్నాకర్‌గా విష్వక్‌ సేన్‌, రత్నమాలగా అంజలి, బుజ్జి పాత్రలో నేహాశెట్టి ఆకట్టుకున్నారు.

క‌థేంటంటే?ఎద‌గ‌డం మ‌న హ‌క్కు అని న‌మ్మిన ఓ యువ‌కుడు లంక‌ల ర‌త్నాక‌ర్ (విష్వక్‌ సేన్‌). తండ్రి చెప్పిన ఆ మాట‌ని చిన్న‌ప్పుడే  బాగా ఒంట‌బ‌ట్టించుకుంటాడు. మానవత్వాన్ని ప‌క్క‌న‌పెట్టి, ఎదుటివాళ్ల‌ని వాడుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు. చిన్నచిన్న దొంగ‌త‌నాలు చేసే ర‌త్నాకర్‌.. స్థానిక ఎమ్మెల్యే దొర‌సామి (గోప‌రాజు ర‌మ‌ణ‌)కి కుడిభుజంగా మార‌తాడు. దొర‌సామి, నానాజీల మ‌ధ్య న‌డుస్తున్న రాజ‌కీయ వైరంలోకీ త‌ల‌దూర్చుతాడు. ఆ రాజ‌కీయం అత‌న్ని ఎక్కడిదాకా తీసుకెళ్లింది? అత‌ను కోరుకున్న‌ట్టు ఎదిగాడా, లేదా? లంక‌ల్లోని ప‌గ ఎలా వెంటాడింది? బుజ్జి (నేహాశెట్టి), ర‌త్న‌మాల (అంజ‌లి)ల‌తో రత్నాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని