Gangs Of Godavari Review: రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’... మాస్ గెటప్‌లో విష్వక్సేన్ మెప్పించారా...?
విష్వక్సేన్ మాస్ లుక్‌లో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎలా ఉందో చూద్దాం.
నటీనటులు: విష్వక్సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమార్, హైపర్ ఆది, పమ్మిసాయి, మధునందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, పృథ్వీరాజ్, మయాంక్ పరాఖ్, ఆయేషా ఖాన్ (ప్రత్యేక గీతం) తదితరులు. ఛాయాగ్రహణం: అనిత్ మదాడి, సంగీతం: యువన్ శంకర్ రాజా, కూర్పు: నవీన్ నూలి, కళ: గాంధీ నడికుడికర్, నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, రచన, దర్శకత్వం: కృష్ణచైతన్య. నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, విడుదల: 31 మే 2024
కొన్ని నెలలుగా మూతపడిన థియేటర్ల తలుపులు మళ్లీ తెరచుకునేలా ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రావడం... విష్వక్సేన్ (Vishwak sen) కథానాయకుడిగా నటించిన సినిమా కావడంతో విడుదలకి ముందే సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహించడంతోపాటు... ప్రచార చిత్రాలూ ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం...
కథేంటంటే?
ఎదగడం మన హక్కు అని నమ్మిన ఓ యువకుడు లంకల రత్నాకర్ (విష్వక్ సేన్). తండ్రి చెప్పిన ఆ మాటని చిన్నప్పుడే బాగా ఒంటబట్టించుకుంటాడు. తనలోని మనిషిని పక్కనపెట్టి, ఎదుటివాళ్లని వాడుకోవడమే పనిగా పెట్టుకుంటాడు. చిన్నచిన్న దొంగతనాలు చేసే రత్నాకర్ ... స్థానిక ఎమ్మెల్యే దొరసామి (గోపరాజు రమణ)కి కుడిభుజంగా మారతాడు. దొరసామి, నానాజీల మధ్య నడుస్తున్న రాజకీయ వైరంలోకీ తలదూర్చుతాడు (Gangs Of Godavari Review). ఆ రాజకీయం అతన్ని ఎక్కడిదాకా తీసుకెళ్లింది? అతను కోరుకున్నట్టు ఎదిగాడా, లేదా? లంకల్లోని పగ అతన్ని ఎలా వెంటాడింది? బుజ్జి(నేహాశెట్టి), రత్నమాల (అంజలి)లతో రత్నాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
గోదావరి నేపథ్యంలో సినిమా అనగానే పచ్చటి పల్లెసీమలు, ప్రశాంతమైన వాతావరణమే గుర్తొస్తుంది. ఇప్పటివరకు మన సినిమాల్లో ఎక్కువగా చూపించింది అదే. కృష్ణచైతన్య మాత్రం కాస్త భిన్నంగా ఎరుపెక్కిన గోదావరిని ఈ సినిమాలో చూపించారు (Telugu Movie Review). అక్కడి రాజకీయాలు, ఆధిపత్య పోరు, లంక గ్రామాల్లోని పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని ముడిపెడుతూ కథని మలిచారు. అక్కడక్కడా రంగస్థలం ఛాయలు కనిపించే ఈ కథ పరిధి గోదావరి అంతా విస్తృతంగానే వుంటుంది. ప్రతీ పాత్రకీ దానిదైన ఓ ప్రయాణంతో స్క్రిప్ట్‌ని రాసుకున్నాడు దర్శకుడు. కానీ విష్వక్సేన్, అంజలి పాత్రలు మినహా మిగతా ఏ పాత్రలూ ప్రభావం చూపించవు. గాఢత, భావోద్వేగాలే ఇలాంటి కథలకు బలం. కానీ ఇందులో చాలా సన్నివేశాలు మరీ ఎక్కువ నాటకీయతతో సాగడం.. ప్రతినాయకుడి పాత్రల్లో బలం లేకపోవడం.. కథానాయిక నేహాశెట్టి పాత్ర కూడా పెద్దగా ప్రభావం చూపించేలా లేకపోవడంతో ఆశించిన భావోద్వేగాలు పండలేదు (Movie Review). మంచి విజువల్స్, సంగీతంతో కూడిన ఖరీదైన సన్నివేశాలు తెరపైన చప్పగా సాగిపోతూ ఉంటాయి. రాజకీయ క్రీడలో భాగంగా కథానాయకుడు వేసే ఎత్తులు పైఎత్తులు చాలానే ఉంటాయి. వాటిని మరింత ఉత్కంఠభరితంగా తెరకెక్కిస్తే బాగుండేది. ఇంత గాఢమైన కథని, నేపథ్యాన్ని ఆవిష్కరిస్తున్నపుడు ప్రతినాయకుల్ని మరీ అంత బలహీనంగా చూపించడం కథకు ఏమాత్రం అతకలేదు.
లంక గ్రామాల్లో కత్తి పట్టే సంప్రదాయంతో సన్నివేశాల్ని మొదలుపెట్టిన దర్శకుడు వేగంగానే కథా ప్రపంచంలోకి తీసుకెళ్లారు (Gangs Of Godavari Review telugu). కథానాయకుడిని మాస్‌గా ఆవిష్కరించిన తీరు, పోరాటాలు, అంజలి పాత్ర ప్రయాణం ప్రథమార్థానికి ఆకర్షణగా నిలుస్తాయి. కథానాయకుడి పాత్రలో మాస్ కోణం, అతని వ్యక్తిత్వం వరకూ సమస్యలేమీ లేకపోయినా... ఆ పాత్ర ఎదుగుదల చూపెట్టిన తీరే మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఓ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయడం, మరో ఎమ్మెల్యేని చంపి నదిలోకి విసిరేయడం వంటి సన్నివేశాలే అందుకు ఉదాహరణ. ద్వితీయార్థం సినిమాలో నదిలో సాగే ఓ సన్నివేశం బాగుంది. చివర్లో తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో భావోద్వేగాల్ని పండించే ప్రయత్నం చేసినా అదేమీ ప్రభావం చూపించలేదు.
ఎవరెలా చేశారంటే?
యువ నాయకుడు లంకల రత్నాకర్‌గా విష్వక్సేన్ (Vishwak sen) తనదైన ముద్ర వేశాడు. తనలోని మాస్ కోణానికి తగిన శక్తివంతమైన పాత్ర ఇది. అందుకు తగ్గట్టుగానే హుషారుగా నటించాడు. పోరాటాలు, పాటలపైనా ప్రభావం చూపించారు. అంజలి పాత్ర అర్థవంతంగా ఉంటుంది. ఆ పాత్రపై ఆమె అంతే ప్రభావం చూపించారు. నేహాశెట్టి అందంగా కనిపించింది. కానీ ఆ పాత్ర ప్రయాణంలోనే కొన్ని సమస్యలున్నాయి. నాజర్, గోపరాజు రమణ, సాయికుమార్, ప్రవీణ్, పమ్మి సాయి, హైపర్ ఆది తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. గ్యాంగ్స్‌లో కనిపించే పాత్రలూ బలంగా గుర్తుండిపోయేలా ఉంటాయి. సాంకేతిక విభాగాలే ఈ సినిమాకి ప్రధాన బలం. కెమెరా విభాగం అత్యుత్తమ పనితీరుని ప్రదర్శించింది. 90వ దశకం నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రతీ ఫ్రేమ్ విలువైనదిగా ఉంటుంది. యువన్ శంకర్ రాజా నేపథ్యసంగీతం మరో ఆకర్షణ ఈ సినిమాకి. చాలారోజుల తర్వాత తెలుగు సినిమాకు పని చేయడంతో ఈ సినిమాపై చాలా ప్రభావం చూపించారు. మోత మోగిపోద్ది, సుట్టంలా సూసి పాటలు, చిత్రీకరణ బాగున్నాయి (Gangs Of Godavari Review). కళ, కూర్పు తదితర విభాగాల పనితీరు కూడా మెప్పిస్తుంది. రచయితగా కృష్ణచైతన్య ముద్ర ఈ సినిమాపై కనిపిస్తుంది కానీ, ఆయన రచన పరంగానే ఈ సినిమాకి చాలాచోట్ల లోటు చేశారు. తర్వాత ఏం జరుగుతుందనే ఆత్రుత, ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు ఉంటే బాగుండేది. గోదావరిలో ఎరుపు, గోదావరి లంకల్లో ఏడుపు నాతోనే ఆగిపోవాలి... సహా చాలా సంభాషణలు గుర్తుండిపోతాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
+ బలాలు
+ విష్వక్సేన్ నటన
+ కథా నేపథ్యం
+ ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం
- బలహీనతలు
- భావోద్వేగాలు
- నాటకీయతతో కూడిన సన్నివేశాలు
చివరిగా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి... ఎరుపెక్కిన గోదావరి
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? -
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా? -
రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ అంజలి, శ్రీతేజ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘బహిష్కరణ’. ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: బ్యాడ్ న్యూజ్.. విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?
Bad Newz movie review: విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైన్ ఎలా ఉంది? -
రివ్యూ: డార్లింగ్.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా?
ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటించిన రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే? -
రివ్యూ: భారతీయుడు2.. కమల్, శంకర్ కాంబో మరోసారి హిట్ అయిందా?
indian 2 review: కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్ కీలక పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు2’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ధూమం.. ఫహద్ ఫాజిల్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి కీలక పాత్రల్లో నటించిన ‘ధూమం’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
సోనియా సింగ్, పవన్ సిద్ధు నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే! -
రివ్యూ: వెబ్‌సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?
Mirzapur Season 3 Review: యువతను విశేషంగా ఆకట్టుకున్న సిరీస్‌ల్లో మీర్జాపూర్ ఒకటి. ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
Guruvayoor Ambalanadayil Review: పృథ్వీరాజ్ సుకుమార్, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉంది?
kalki 2898 ad review in telugu: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
Yakshini review in telugu: వేదిక, రాహుల్ విజయ్, మంచు లక్ష్మీ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘యక్షిణి’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
రివ్యూ: పరువు.. నివేదా పేతురాజ్ నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj), నటుడు నరేశ్ అగస్త్య (Naresh Agastya), నాగబాబు (Nagababu) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘పరువు’ (paruvu). ‘జీ 5’లో విడుదలైన ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: హరోం హర.. సుధీర్‌బాబు ఖాతాలో హిట్ పడిందా?
సుధీర్‌బాబు, మాళవిక శర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ‘హరోం హర’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మహారాజ.. విజయ్ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?
Maharaja Review: వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న విజయ్‌సేతుపతి కెరీర్లో 50వ చిత్రం ‘మహారాజ’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు మెప్పించింది? -
రివ్యూ: మిరల్.. ‘ప్రేమిస్తే’ భరత్ నటించిన చిత్రం భయపెట్టిందా?
ప్రేమిస్తే సినిమా హీరో భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘మిరల్’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. రివ్యూ మీకోసం.. -
రివ్యూ: కల్కి.. టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉంది?
మలయాళంలో మంచి టాక్ సొంతం చేసుకున్న టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ‘కల్కి’ మెప్పించిందా? -
రివ్యూ: మనమే.. శర్వానంద్, కృతిశెట్టిల మూవీ ఎలా ఉంది?
Manamey Movie Review: శర్వానంద్, కృతిశెట్టి జంటగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మెప్పించిందా? -
రివ్యూ: సత్యభామ.. కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాక్ ఏంటి?
కాజల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
Mr And Mrs Mahi Review: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది? -
రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
మలయాళంలో విజయవంతమైన ‘కీడమ్’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ‘కీచురాళ్ళుగా’ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్