Crew: ఘాగ్రా స్టెప్పులేసిన క్రూ

ఒకేచోట పనిచేసే ముగ్గురి మహిళల జీవితాల్ని విధి ఊహించని మలుపులు తిప్పుతుంది. అబద్ధాల వలయంలో చిక్కుకునేలా చేస్తుంది.

Updated : 14 Mar 2024 09:26 IST

ఒకేచోట పనిచేసే ముగ్గురి మహిళల జీవితాల్ని విధి ఊహించని మలుపులు తిప్పుతుంది. అబద్ధాల వలయంలో చిక్కుకునేలా చేస్తుంది. దాంతో వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘క్రూ’ చిత్రం. కరీనా కపూర్‌, టబు, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో రాజేశ్‌ కృష్ణన్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘ఘాగ్రా’ అనే పార్టీ పాటని ఇన్‌స్టా వేదికగా విడుదల చేసింది. ‘అందర్నీ ప్రపంచాన్ని చుట్టేలా చేస్తుంది డబ్బు. ఇప్పుడు ఈ ‘క్రూ’ని కూడా. ‘క్రూ’తో ఘాగ్రా స్టెప్పులు వేసేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ప్రజాదరణ పొందిన ఓ రాజస్థానీ పాటకి కొత్త వెర్షన్‌గా ఈ పాటను రూపొందించారు.  పార్టీలో ఆనందంగా ఈ ముగ్గురు నాయికలు వేసే స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇలా అరుణ్‌, రోమీ, శ్రుతి తవాడే కలిసి ఈ పాటని ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు