Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ చిత్రం ప్రారంభం

ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్‌కిషన్‌. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది.

Updated : 24 Apr 2024 12:04 IST

ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్‌కిషన్‌. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రావు రమేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజేశ్‌ దండా నిర్మాత. ఇది సందీప్‌కిషన్‌ 30వ చిత్రం. మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నిచ్చారు. దర్శకుడు విజయ్‌ కనకమేడల కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత అనిల్‌ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్‌, ఛాయాగ్రహణం: నిజార్‌ షఫీ, కళ: బ్రహ్మ కడలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని