NARAPPA: అమెజాన్ ప్రైమ్‌లో ‘నారప్ప’?
అగ్ర కథానాయకుడు వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘నారప్ప’ సినిమా కోసం సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని చిత్రబృందం ....
రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘నారప్ప’ సినిమా కోసం సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని చిత్రబృందం మొదట భావించినప్పటికీ కరోనా సెకండ్‌వేవ్ కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో సినిమా విడుదల వాయిదా పడింది. లాక్డౌన్ అనంతరం పూర్తిస్థాయిలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకోనున్నాయనే విషయంలో స్పష్టత రాని కారణంగా ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించినట్లు ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌కు ‘నారప్ప’ టీమ్‌తో డీల్ కుదిరిందని తాజాగా నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. జులై 24న ఈ సినిమా విడుదల కావొచ్చని అనుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ధనుష్ కథానాయకుడిగా కోలీవుడ్‌లో తెరకెక్కిన సూపర్‌హిట్ చిత్రం ‘అసురన్’కు రీమేక్‌గా ‘నారప్ప’ సిద్ధమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేశ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా ప్రియమణి నటించారు. కుల వ్యవస్థ, భూ వివాదం.. వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా చిత్రీకరించబడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్‌కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్‌పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది