105 Minuttess: హన్సిక ప్రయోగాత్మక చిత్రం.. మరో ఓటీటీలోకి ‘105 మినిట్స్‌’

హన్సిక నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘105 మినిట్స్‌’. ఈ సినిమా మరో ఓటీటీలోకి రానుంది.

Published : 05 Jun 2024 21:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకే ఒక్క పాత్రతో ఎడిటింగ్‌ లేకుండా సింగిల్‌ షాట్‌లో చిత్రీకరించిన చిత్రం ‘105 మినిట్స్‌’ (105 Minuttess). ఆరు రోజుల్లోనే షూటింగ్‌ పూర్తికావడం విశేషం. హన్సిక (Hansika) ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాని రాజు దుస్సా తెరకెక్కించారు. ఈ హారర్‌ థ్రిల్లర్‌ జనవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చింది. ఇప్పటికే ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ (అద్దె ప్రాతిపదికన) అవుతుండగా మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ (Aha)లో జూన్‌ 7న రిలీజ్‌ కానుంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న భరత్‌ హారర్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

క‌థేంటంటే: జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికెళ్తుంటే త‌న‌నేదో అదృశ్య శ‌క్తి వెంటాడుతున్న‌ట్లు.. తనను హ‌త్య చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు లోన‌వుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. అంత‌కు ముందు వెంటాడిన ఆ అదృశ్య శ‌క్తి.. త‌న‌ను ఇంట్లోనే ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం మొద‌లు పెడుతుంది. ప్రాణాల‌ను అర చేతిలో పెట్టుకుని ఆ ఇంటి నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంది జాను. కానీ, ఇంట్లో ఉన్న శ‌క్తి త‌న‌ను అడ్డుకుంటుంది. త‌న మ‌ర‌ణానికి జానునే కార‌ణ‌మ‌ని.. తాను పెట్టే చిత్రహింసను అనుభ‌వించాల్సిందే అంటూ భీక‌ర స్వ‌రంతో భ‌య‌పెడుతుంటుంది. మ‌రి, ఆ ఇంటి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని