Hanuman: ‘హను-మాన్‌’ ఓటీటీ రిలీజ్‌.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా..?

‘హను-మాన్‌’ (Hanuman) ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. జీ5 వేదికగా ఇది ప్రసారం కానుంది.

Published : 29 Jan 2024 17:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’ (Hanuman). సూపర్ హీరో కథకు పురాణాల నేపథ్యం జోడించి తెరకెక్కించారు. ఇది సంక్రాంతి కానుకగా విడుదలై అంతటా ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. జీ5 వేదికగా ఇది ప్రసారం కానుంది. మార్చి మొదటి వారం నుంచి స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్‌లో రిలీజైన మూడు వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకురావాలని భావించినప్పటికీ.. ప్రస్తుతం చిత్రానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని రిలీజ్‌ విషయంలో పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. 50 రోజులు పూర్తైన తర్వాతే దీనిని విడుదల చేయనున్నారని.. ఈమేరకు మార్చి ఫస్ట్‌ లేదా సెకండ్‌ వీక్‌లో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం.

Filmfare Awards 2024: ఉత్తమ నటుడు రణ్‌బీర్‌.. ఉత్తమ చిత్రం 12th ఫెయిల్‌

కథేంటంటే: సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్‌ రాయ్‌)కు చిన్నప్పటినుంచి సూపర్‌ హీరో అవ్వాలని బలమైన కోరిక. అందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రుల్ని  చిన్నతనంలోనే చంపేస్తాడు. సూపర్‌ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తాడు. కానీ, అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దీంతో అసలు సిసలు సూపర్‌ పవర్స్‌ కనిపెట్టేందుకు వేట మొదలుపెడతాడు. కట్‌ చేస్తే.. కథ అంజనాద్రికి చేరుతుంది. పాలెగాడు గజపతి (దీపక్‌ శెట్టి) అకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరు అది. ఆ ఊరిలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు హనుమంతు (తేజ సజ్జా). ఓసారి అతనికి ఆంజనేయస్వామి రక్త బిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది. అది తన చేతికొచ్చిన తర్వాత నుంచి హనుమంతు జీవితం మారిపోతుంది. ఆ మణి ద్వారా ఆంజనేయుడి శక్తులు పొంది హనుమ్యాన్‌గా మారతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ శక్తులతో అతను చేసిన సాహసాలేంటి? హనుమంతు దగ్గరున్న రుధిరమణిని చేజిక్కించుకునేందుకు మైఖేల్‌ ఏం చేశాడు? అతని నుంచి అంజనాద్రికి ఏర్పడిన ముప్పును హనుమంతు ఎలా తొలగించాడు? ఈ క్రమంలో అతనికి విభీషణుడు (సముద్రఖని) ఎలాంటి సాయం అందించాడు? అనే అంశాలతో దీనిని రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని