Filmfare Awards 2024: ఉత్తమ నటుడు రణ్‌బీర్‌.. ఉత్తమ చిత్రం 12th ఫెయిల్‌

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నిలవగా, ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌ నిలిచింది.   

Updated : 29 Jan 2024 13:12 IST

గుజరాత్‌: బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (69th FilmFare Awards) అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులు అందించారు. రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor), అలియాభట్‌ (Alia Bhatt) జంట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 12th ఫెయిల్‌ (12th Fail) ఉత్తమ చిత్రంగా నిలవగా, ఈ చిత్ర దర్శకుడు బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్‌’, విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ‘12th ఫెయిల్‌’ ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయి.

అవార్డుల జాబితా ఇదే..

  • ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌
  • ఉత్తమ దర్శకుడు:  విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)
  • ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)
  • ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌ 
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)
  • ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ (యానిమల్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవినాశ్‌ అరుణ్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుభ్రతా చక్రవర్తి, అమిత్‌ రాయ్‌ (సామ్‌ బహదూర్‌)
  • ఉత్తమ ఎడిటింగ్‌: జస్కున్వర్‌ సింగ్‌ కోహ్లీ, విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: సచిన్ లవ్లేకర్, దివ్యా గంభీర్‌, నిధి గంభీర్‌ (సామ్‌ బహదూర్‌)
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: కునాల్‌ శర్మ (సామ్‌ బహదూర్‌), సింక్‌ సినిమా (యానిమల్‌)
  • ఉత్తమ కొరియోగ్రఫీ: గణేశ్‌ ఆచార్య (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ యాక్షన్‌: స్పిరో రజాటోస్, అనల్‌ అరసు (జవాన్‌)
  • ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: రెడ్‌ చిల్లీస్‌ వీఎఫ్‌ఎక్స్‌ (జవాన్‌)
  • ఉత్తమ నూతన దర్శకుడు: తరుణ్ దుడేజా (ధక్ ధక్‌)
  • ఉత్తమ నూతన నటుడు: ఆదిత్య (ఫరాజ్)
  • ఉత్తమ నూతన నటి: అలిజే అగ్నిహోత్రి (ఫారే)
  • జీవిత సాఫల్య పురస్కారం: డేవిడ్‌ ధావన్‌
  • ఆర్‌.డి. బర్మన్‌ అవార్డ్‌ ఫర్‌ అప్‌ కమింగ్‌ మ్యూజిక్‌ టాలెంట్‌: శ్రేయ పురాణిక్ (యానిమల్)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని