Renu Desai: ‘యానిమల్‌’ని ప్రశంసించి.. కామెంట్‌ సెక్షన్‌ క్లోజ్‌ చేసిన రేణూ దేశాయ్‌

‘యానిమల్‌’పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటి రేణూ దేశాయ్‌ (Renu Desai). ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 06 Dec 2023 16:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. హింసను తీవ్ర స్థాయిలో చూపించినప్పటికీ ఈ సినిమా తమకెంతో నచ్చిందని పలువురు తారలు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం ఇందులో స్త్రీని తక్కువ చేసి చూపించడం ఏమీ బాలేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటి రేణూ దేశాయ్‌ (Renu Desai). ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. చిత్రంలోని ఫైట్‌ సీక్వెన్స్‌లు తనకెంతో నచ్చాయన్నారు.

‘‘ఎట్టకేలకు నిన్న ‘యానిమల్‌’ చిత్రాన్ని చూశా. అందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌లు నాకెంతో నచ్చేశాయి. మీరు ఏదైనా కాస్త విభిన్నంగా చూడాలనుకుంటే థియేటర్‌లో ఈ చిత్రాన్ని చూడటం మిస్‌ కావొద్దు’’ అని రేణూ దేశాయ్‌ తెలిపారు. అయితే, ఈ పోస్ట్‌కు ఆమె కామెంట్‌ సెక్షన్‌ క్లోజ్‌ చేశారు. ఈ సినిమా విషయంలో ఇటీవల నటి త్రిషకు ఎదురైన విమర్శలను దృష్టిలో ఉంచుకునే రేణూ దేశాయ్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Priyanka Chopra: డీప్‌ ఫేక్‌ బారిన ప్రియాంక చోప్రా.. నకిలీ వీడియో వైరల్‌

త్రిష విషయంలో ఏం జరిగిందంటే:

‘యానిమల్‌’ చిత్రాన్ని వీక్షించిన త్రిష.. ఆ సినిమా పోస్టర్‌ షేర్‌ చేసి ‘కల్ట్‌ మూవీ’ అని ప్రశంసించారు. దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వివాదం జరిగినప్పుడు మహిళల గౌరవం గురించి అంతలా మాట్లాడిన త్రిష.. స్త్రీని తక్కువ చేసి చూపించే ఇలాంటి చిత్రాలను మెచ్చుకోవడం ఏం బాలేదంటూ విమర్శించారు. పోస్ట్‌కు వస్తోన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని త్రిష ఇన్‌స్టా స్టోరీని వెంటనే తొలగించినట్లు సమాచారం.

రష్మికను మెచ్చుకున్న హరీశ్‌:

‘యానిమల్‌’ విజయం అందుకున్న సందర్భంగా ఆ చిత్ర కథానాయిక రష్మికను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మెచ్చుకున్నారు. ‘‘క్రష్మికకు నా అభినందనలు. గీతాంజలిగా ఆమె అందరి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఆమె మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. త్వరలోనే ఆ సినిమాపై నా అభిప్రాయాన్ని తెలియజేస్తా’’ అని ఆయన అన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని