Animal: సందీప్‌ వంగాను అలా అనుకోవడం అమాయకత్వం..: హరీశ్‌ శంకర్‌

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ‘యానిమల్‌’పై (Animal) తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సినిమాతో తన అపోహ తొలగిపోయిందన్నారు.

Updated : 07 Dec 2023 11:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌-రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యానిమల్‌’(Animal). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచే ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం.. విడుదల అనంతరం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పరిశ్రమలోని ప్రముఖులంతా దీన్ని ప్రశంసిస్తూ రివ్యూలను చెప్పారు. తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్‌ (Harish Shankar)తనదైన శైలిలో దీనిపై రివ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

‘‘యానిమల్‌’ నచ్చిన వాళ్లు బాగుంది అనడం లేదు.. బద్దలైపోయిందని చెబుతున్నారు. సినిమాకు రూల్స్‌ ఏం లేవని అందరూ అంటుంటారు. కానీ, సందీప్‌ వంగా మాత్రం రూల్స్‌ను బ్రేక్ చేసి చూపించారు. సెకండాఫ్‌ గురించి నాకు కొంత ఆందోళన ఉన్నప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. కథ గురించి వాదించొచ్చు కానీ, విజయం గురించి వాదించలేం. సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అనేకంటే.. దీని గురించి చెప్పడానికి ఎవరూ లేరు. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసిన వాళ్లందరూ రెండుసార్లు దీన్ని చూశారు. ఈ చిత్ర దర్శకుడి పేరులోనే ‘వంగా’ అని ఉన్నప్పుడు.. విమర్శకులకు, విశ్లేషణలకు అతడు వంగుతాడనుకోవడం అమాయకత్వం. ఎవరి విషయం ఎలా ఉన్నా .. ఎక్కువ నిడివి ఉంటే ప్రేక్షకులు సినిమాకు రారేమో అనే నా అపోహను సందీప్‌ (Sandeep Reddy Vanga) ‘యానిమల్‌’లోని ఇంటర్వెల్‌లో వాడిన గన్‌తో పేల్చేశారు. ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు’’ అని హరీశ్‌ శంకర్‌ పేర్కొన్నారు. ఈ రివ్యూ బాగుందని రామ్‌గోపాల్‌ వర్మ అభినందించారు.

రివ్యూ: హాయ్‌ నాన్న.. నాని ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

ఇక ఈ సినిమాలో గీతాంజలిగా తన నటనతో ఆకట్టుకున్న రష్మిక (Rashmika) గురించి కూడా హరీశ్‌ శంకర్‌ ఇటీవల ఓ పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ‘‘క్రష్మికకు నా అభినందనలు. గీతాంజలిగా అందరి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఆమె మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని