Ravi Teja: రాసి పెట్టుకోండి.. టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకడవుతాడు: రవితేజ

‘ఈగల్‌’ సక్సెస్‌ మీట్‌లో రవితేజ మాట్లాడారు. దర్శకుడు కార్తీక్‌ని ప్రశంసించారు.

Published : 11 Feb 2024 23:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈగల్‌’ (eagle) సినిమాని తెరకెక్కించిన కార్తీక్‌ ఘట్టమనేని టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకడవుతాడని రవితేజ (Ravi Teja) అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ మూవీ సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌, నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం విడుదలై, ప్రేక్షకాదరణ పొందింది.

ధైర్యం ఉంటే నా ఫొటో పెట్టి అలా రాయండి: హరీశ్‌ శంకర్‌

రవితేజ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మేకోవర్‌కు సంబంధించి ప్రశంసలు వెల్లువెత్తాయి. కార్తీక్‌ తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేస్తానన్నాడుగానీ ఎక్కువ సమయం తీసుకున్నాడు (నవ్వుతూ). పీపుల్‌ మీడియా నిర్మాణ సంస్థకు కంగ్రాట్స్‌. ఈ ప్రొడక్షన్‌ హౌజ్‌లో నేను నటించిన రెండో చిత్రమిది. ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నా. సంగీత దర్శకుడు డేవ్‌ జాండ్‌, రచయిత మణి, హీరోయిన్‌ కావ్యా థాపర్‌కు మంచి భవిష్యత్తు ఉంది. రాసి పెట్టుకోండి.. కార్తీక్‌ టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకడవుతాడు. చెప్పిన దానికంటే అద్భుతంగా తెరకెక్కించాడు. నన్ను కొత్తగా చూపించాడు’’ అని ఆనందం వ్యక్తం చేశారు.

వెబ్‌సైట్‌కు త్వరలోనే రివార్డు!: టీజీ విశ్వప్రసాద్‌

‘‘ఓ వెబ్‌సైట్‌ మా సినిమాని ప్రమోట్‌ చేయడంలో బాగా సహకరించింది. ఆ సైట్‌కు ఎలా రివార్డు ఇవ్వాలా? అని త్వరలోనే  నిర్మాతలందరితో కలిసి చర్చిస్తా’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ వ్యంగ్యంగా పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని