Hi Nanna: ఆ సినిమాతో ‘హాయ్‌ నాన్న’కు సంబంధం లేదు: నాని

తన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ ప్రచారంలో ఫుల్‌ బిజీగా ఉన్నారు హీరో నాని. కేరళలోని కొచ్చిలో ఆదివారం సందడి చేశారు.

Updated : 26 Nov 2023 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna).. ఓ తమిళ సినిమాను పోలి ఉంటుందా? అని విలేకరి అడిగిన ప్రశ్నపై హీరో నాని (Nani) స్పందించారు. ఆ చిత్రానికి, ‘హాయ్‌ నాన్న’కు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. శ్రుతి హాసన్‌, బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం డిసెంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌, చెన్నైలో ప్రెస్‌మీట్‌ నిర్వహించగా కొచ్చి (కేరళ)లో ఆదివారం నిర్వహించింది. ‘హాయ్‌ నాన్న’ మలయాళ ట్రైలర్‌ విడుదల అనంతరం నాని అక్కడి మీడియాతో మాట్లాడారు.

ఒకే వేదికపై సందడి చేయనున్న రాజమౌళి- మహేశ్‌.. ఎక్కడంటే?

ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్‌.. ‘హాయ్‌ నాన్న’ ట్రైలర్‌ చూస్తుంటే తమిళ సినిమా ‘దాదా’లా ఉంది. ఆ చిత్రానికి, హాయ్‌ నాన్నకు ఏమైనా సంబంధం ఉందా? అని అడగ్గా నాని అలాంటిదేం లేదన్నారు. ఆ సినిమా గురించి ఎవరో చెబితే చూశానని, తనకు నచ్చిందని తెలిపారు. ‘హాయ్‌ నాన్న’లో ఐదు పాటలు ఉన్నాయన్నారు. పలు సన్నివేశాల్లో బిట్‌ సాంగ్స్‌ వినిపిస్తాయని చెప్పారు. దర్శకుల విషయంలో కొత్త, పాత అనేదాన్ని పట్టించుకోనన్నారు. కొందరు నూతన దర్శకులు అందించిన హిట్‌ చిత్రాలను గుర్తుచేశారు. కవిన్‌, అపర్ణా దాస్‌ జంటగా దర్శకుడు గణేశ్‌ కె.బాబు తెరకెక్కించిన ‘దాదా’ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని