bade miyan chote miyan ott: ఓటీటీలో ‘బడేమియా ఛోటేమియా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published : 30 May 2024 15:03 IST

Bade Miyan Chote Miyan ott: (ఇంటర్నెట్‌డెస్క్‌): అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. మానుషి చిల్లర్‌, అలయా ఎఫ్‌ కథానాయికలుగా నటించిన ఈ మూవీలో ఇమ్రాన్‌ హష్మి ప్రతినాయకుడిగా నటించారు. ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశాన్ని కాపాడే సైనికులుగా అక్షయ్‌, టైగర్‌ తమ యాక్షన్‌తో అదరగొట్టారు. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో జూన్‌ 6వ తేదీ నుంచి హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ ఓటీటీ సంస్థ కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

కథేంటంటే: ఫ్రెడ్డీ అలియాస్ ఫిరోజ్ (అక్ష‌య్ కుమార్‌), రాకేష్ అలియాస్ రాకీ ఇండియ‌న్ ఆర్మీలో సైనికులు. అఫ్గాన్‌లో ఓ ఆప‌రేష‌న్ కోసం వెళ్లి, విజ‌య‌వంతంగా పూర్తి చేసుకొచ్చాక వీళ్లిద్ద‌రూ బ‌డేమియా, ఛోటేమియాగా ప్రాచుర్యం పొందుతారు. ఉత్త‌మ సైనికులుగా గుర్తింపుపొందిన ఇద్ద‌రినీ కొన్నాళ్ల త‌ర్వాత ఉన్నతాధికారులు ఉద్యోగాల నుంచి తొల‌గిస్తారు. ఎవ‌రి ప్ర‌పంచంలో వాళ్లు గ‌డుపుతుండ‌గా, ఎనిమిదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇండియ‌న్ ఆర్మీ నుంచి పిలుపొస్తుంది. ఆర్మీ చేతుల్లో ఉన్న ఓ శ‌క్తిమంత‌మైన ఆయుధాన్ని మ‌రో చోటుకు త‌ర‌లిస్తుండ‌గా, శ‌త్రువు దాడి చేసి లండ‌న్ తీసుకెళ్లిపోతాడు. దాన్ని తిరిగి తీసుకురావ‌డం కోసం కెప్టెన్ మిషా (మానుషి చిల్ల‌ర్‌)తో క‌లిసి బ‌డేమియా, ఛోటే మియా రంగంలోకి దిగుతారు. ఇంత‌కీ ఆ ఆయుధం వెన‌క క‌థేమిటి? దాన్ని తీసుకెళ్లిపోయిన క‌బీర్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఎవ‌రు? భార‌తీయ సైన్యంపై అత‌ను ప‌గ పెంచుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి?(Bade Miyan Chote Miyan) ఆ ఆయుధాన్ని తిరిగి తీసుకొచ్చారా లేదా? అన్నది మిగిలిన కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని