Fighter ott: ఓటీటీలో ‘ఫైటర్‌’ రికార్డులు.. ఆ హాలీవుడ్‌ మూవీని దాటేసింది!

Fighter ott: ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Published : 03 Apr 2024 21:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్స్‌ హృతిక్ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫైటర్‌’ (Fighter). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 20 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఓపెనింగ్‌ వీక్‌లో ఈ మూవీ 5.9 మిలియన్‌ వ్యూస్‌ను సాధించింది. అంతేకాదు, గ్లోబల్‌గా నాన్‌ ఇంగ్లీష్‌ మూవీస్‌ టాప్‌-10లోనూ చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రెండో వారంలోనూ 6.5 మిలియన్‌ వ్యూస్‌తో మూడో స్థానంలో నిలిచింది. రెండు వారాల్లో 12.4 మిలియన్‌ వ్యూస్‌ను సాధించడం గమనార్హం. మార్చి నెలలో నెట్‌ఫ్లిక్స్‌ విడుదలైన టామ్‌ క్రూజ్‌ టాప్‌గన్‌: మావెరిక్‌ కేవలం 3.2 మిలియన్‌ వ్యూస్‌తో సరిపెట్టుకోవడం గమనార్హం. జనవరి 25న విడుదలైన ‘ఫైటర్‌’ బాక్సాఫీస్‌ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇదీ ‘ఫైటర్‌’ కథ: సంషేర్ ప‌ఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోష‌న్‌) భార‌త వైమానిక ద‌ళంలో స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌. సాహ‌సాల‌కు వెనకాడ‌ని ఫైట‌ర్ పైల‌ట్‌. అప్ప‌జెప్పిన బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించే క్ర‌మంలో త‌న‌కున్న ప‌రిధుల్ని, నిబంధ‌న‌ల్ని దాటి మ‌రీ సాహ‌సాలు చేస్తుంటాడు. ఆ క్ర‌మంలోనే జ‌రిగిన ఓ దుస్సంఘ‌ట‌న‌కి బాధ్యుడిగా నింద‌ని మోస్తూ ఉంటాడు.  రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓ ఆప‌రేష‌న్ కోసం శ్రీన‌గ‌ర్ వ‌స్తాడు. సీవో రాకీ (అనిల్ క‌పూర్‌) నేతృత్వంలో మిన్ను అలియాస్ మిన‌ల్ సింగ్ రాఠోడ్‌ (దీపికా ప‌దుకొణె), తాజ్ (క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌), బాష్ (అక్ష‌య్ ఒబెరాయ్‌) బృందం రంగంలోకి దిగుతుంది. గ‌గ‌న‌త‌లంలో శ‌త్రువుల‌పై వాళ్ల పోరాటం ఎలా సాగింది? పాటీ మ‌ళ్లీ నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించాడా? రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఆ సంఘ‌ట‌న ఏమిటి? త‌నకు ఎదురైన స‌వాళ్ల‌ని దాటి పాటీ నిజ‌మైన ఫైట‌ర్ అని ఎలా చాటుకున్నాడు? అన్నది మిగిలిన కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని