Animal: రణ్‌బీర్‌తో వర్క్‌.. త్రిప్తి డిమ్రి ఏమన్నారంటే..?

‘యానిమల్‌’ (Animal)లో రణ్‌బీర్‌ (Ranbir Kapoor)తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడంపై నటి త్రిప్తి డిమ్రి (Tripti dimri) స్పందించారు. ఆయనతో మరోసారి వర్క్‌ చేయాలని ఉందన్నారు.

Published : 03 Dec 2023 15:14 IST

ముంబయి: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). సందీప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి (Tripti Dimri) కీలకపాత్ర పోషించారు. జోయా అనే పాత్రలో స్క్రీన్‌పై కనిపించింది కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రణ్‌బీర్‌ - త్రిప్తి మధ్య వచ్చే సన్నివేశాలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

‘‘రణ్‌బీర్‌ కపూర్‌తో వర్క్‌ చేయడం అద్భుతంగా ఉంది. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు.. మంచి మనసు ఉన్న వ్యక్తి. యానిమల్‌’లో మా కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. భవిష్యత్తులో మేము మరోసారి కలిసి వర్క్‌ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా’’ అని త్రిప్తి డిమ్రి అన్నారు.

విజయ్‌ దేవరకొండ, రష్మిక ఫొటో వివాదం.. స్పందించిన నాని

కథేంటంటే: స్వ‌స్తిక్ స్టీల్స్ అధినేత‌, దేశంలోనే సంప‌న్నుడైన బ‌ల్బీర్ సింగ్ (అనిల్ క‌పూర్‌). అతని త‌న‌యుడు విజ‌య్ (ర‌ణ్‌బీర్ సింగ్‌) ఎవ‌రినైనా స‌రే ధైర్యంగా ఎదిరించే ర‌కం. చిన్నతనం నుంచే నాన్నంటే చెప్ప‌లేనంత ప్రేమ‌. కానీ, బ‌ల్బీర్ సింగ్ వ్యాపారాల‌తో బిజీగా గ‌డుపుతూ కొడుకు విజయ్‌ను ప‌ట్టించుకోడు. దూకుడు మ‌న‌స్త‌త్వ‌మున్న విజ‌య్ ప‌నులు తండ్రి బ‌ల్బీర్‌సింగ్‌కి న‌చ్చ‌వు. ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. దాంతో త‌ను ప్రేమించిన గీతాంజ‌లి (ర‌ష్మిక‌)ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతాడు. కొన్నేళ్ల త‌ర్వాత తండ్రిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌ని తెలియ‌డంతో హుటాహుటిన త‌న భార్య‌, పిల్ల‌ల‌తో ఇండియాకు వ‌స్తాడు. వ‌చ్చాక ఏం జ‌రిగింది? త‌న తండ్రిని హ‌త్య చేయాల‌నుకున్న శ‌త్రువుని విజ‌య్ ఎలా గుర్తించాడు? ఇంత‌కీ ఆ శత్రువు ఎవ‌రు? అత‌ని నుంచి విజయ్‌ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు