IMDb: ఐఎండీబీ టాప్‌ 1లో దీపికా.. సౌత్‌ నుంచి సమంతకు ఎన్నో స్థానమంటే!

దశాబ్దకాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన 100 మంది సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ విడుదల చేసింది. ఇందులో టాప్‌లో దీపికా ఉన్నారు.

Published : 29 May 2024 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ దీపికా మరో ఘనతను సాధించారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ(IMDb).. దశాబ్దకాలంగా ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్‌ 1లో దీపికా పదుకొణె నిలిచారు. అలాగే ఈ వరుసలో సమంత 13వ స్థానంలో ఉన్నారు. సౌత్‌ నుంచి టాప్ 15లోపు నిలిచిన స్టార్‌ సమంత కావడం విశేషం.

‘టాప్‌ 100 మోస్ట్‌ వ్యూడ్ ఇండియన్‌ స్టార్స్‌’ పేరుతో 2014 నుంచి 2024 వరకు ఎక్కువ ప్రజాదరణ పొందిన తారల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ఇందులో అగ్ర కథానాయకులను వెనక్కినెట్టి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) టాప్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీనిపై దీపికా మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల అభిరుచికి ఈ జాబితా అద్దం పడుతుంది. ఈ వెబ్‌సైట్‌ ప్రేక్షకుల ఆసక్తికి ప్రాధాన్యమిస్తుంది. ఈ గుర్తింపు నాకు చాలా ప్రత్యేకమైనది. ఇంతమంది ప్రేమను పొందుతున్నందుకు నేను అదృష్టవంతురాలిని అనిపిస్తుంది’ అంటూ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఇక టాప్ 13లో నిలిచిన సమంత (Samantha) ఆనందం వ్యక్తంచేశారు. ‘ఎంతోమంది దర్శకులు, రచయితలు, నిర్మాతల కృషి వల్లే నేను ఈ స్థానంలో ఉన్నాను. ప్రేక్షకులు నాపై చూపే ప్రేమ మరో కారణం. ఎంతో గర్వంగా ఉంది. నాకు ఈ గౌరవాన్ని అందించినందుకు ఐఎండీబీకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా.. చిరును కలిసిన అజిత్‌

ఇక ఈ టాప్‌ 100 జాబితాలో మొదటి 10మంది బాలీవుడ్‌ స్టార్స్‌ కావడం విశేషం. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల స్టార్స్ ఇందులో ఉన్నారు. టాప్‌ 10 విషయానికొస్తే.. దీపికా పదుకొణె, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్యారాయ్‌, అలియా భట్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌, సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, అక్షయ్‌కుమార్‌ ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని