Indian 2: తప్పును భరించడు భారతీయుడు

అవినీతిపరుల భరతం పట్టేందుకు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా ‘భారతీయుడు 2’తో తెరపైకి వస్తున్నారు కమల్‌హాసన్‌.

Updated : 07 Apr 2024 13:22 IST

వినీతిపరుల భరతం పట్టేందుకు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా ‘భారతీయుడు 2’తో తెరపైకి వస్తున్నారు కమల్‌హాసన్‌. ఆయన టైటిల్‌ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని శంకర్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వీళ్లిద్దరి కలయికలోనే వచ్చిన ‘భారతీయుడు’కు కొనసాగింపుగా రూపొందింది. దీన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాజల్‌ కథానాయిక. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. అందులో సేనాపతిగా కమల్‌ తెల్లటి ధోతి, కుర్తాలో చేతికి బేడీలతో సీరియస్‌ లుక్‌లో కనిపించారు. ‘తప్పును అస్సలు భరించలేను’ అంటూ ఆ పోస్టర్‌పై ఉన్న వ్యాఖ్య ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. త్వరలోనే విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నామని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘భారతీయుడు 3’ కూడా ఇప్పటికే సిద్ధమైనట్లు కమల్‌ ఇటీవల ప్రకటించారు. ‘భారతీయుడు 2’ విడుదలైన వెంటనే మూడో భాగానికి సంబంధించిన నిర్మాణాంతర పనుల్ని మొదలు పెట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని