Siddaramaiah: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బయోపిక్‌.. హీరోగా తమిళ నటుడు?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య బయోపిక్‌లో హీరోగా ఎవరిని అనుకుంటున్నారంటే?

Published : 30 Nov 2022 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) జీవితం తెరపైకి రాబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దానిపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్టు కన్నడ మీడియాలో వార్తలొస్తున్నాయి. మాజీ సీఎం పాత్రకు సరిపోయే నటుడి కోసం ప్రస్తుతం అన్వేషణ సాగుతోందట. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (vijay sethupathi) అయితే బాగుంటారని భావించిన బృందం ఆయన్ను సంప్రదించిందని సమాచారం. విజయ్‌ సుముఖంగానే ఉన్నారనే టాక్‌ వస్తోంది. కర్ణాటక మాజీ మంత్రి శివరాజ్‌ తంగడగి ఆ సినిమాని నిర్మించాలనుకుంటున్నారని తెలుస్తోంది. మరి, సిద్ధరామయ్య బయోపిక్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆయన పాత్రలో విజయ్‌ సేతుపతే కనిపిస్తాడా? అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని