Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ తెలుసా..!

జాన్వీ కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..

Updated : 06 Mar 2024 12:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీదేవి తనయగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) కొంతకాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి బోనీక‌పూర్ సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటిస్తూ కెరీర్‌లో బిజీ నాయిక‌గా మారుతోంది. నేడు జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..

డాక్టర్‌ చేయాలనుకుంది..

జాన్వీ కపూర్‌ను శ్రీదేవి డాక్టర్‌ని చేయాలని ఆశించింది. ఈ విషయాన్ని జాన్వీ స్వయంగా వెల్లడించింది. ‘నన్ను డాక్టర్‌గా చూడాలన్నది మా అమ్మ కోరిక. కానీ, నేను యాక్టర్‌ అయ్యాను. డాక్టర్‌ అయ్యేంత టాలెంట్ నాకు లేదేమో అనిపిస్తుంది’ అని సరదాగా చెప్పింది. 

డ్యాన్స్, కవిత్వమంటే ఇష్టం..

ఈ సుందరికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ‘ధడక్’ సినిమా షూటింగ్‌ సమయంలో ఏమాత్రం సమయం లభించినా డ్యాన్స్ చేసేది. సినిమాల్లోకి వచ్చాక డ్యాన్స్ క్లాసులకు వెళ్లడం కుదరలేదని చెప్పింది. అలాగే, కవిత్వమంటే చాలా ఇష్టమని.. అప్పుడప్పుడు కవితలు రాస్తానని తెలిపింది. 

ఈ వాటర్‌ బాటిల్‌ ఎప్పుడూ ప్రత్యేకమే..

జాన్వీకపూర్‌ ఎప్పుడూ తన వెంట రెడ్‌ కలర్‌ వాటర్‌ బాటిల్ తెచ్చుకుంటుంది. అది అంటే ఆమెకు ఇష్టమట. దానికి చుస్కీ అనే పేరు కూడా పెట్టుకుంది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించింది. 

జాన్వీ పేరు వెనుక సీక్రెట్‌ ఇదే..

ఈ బాలీవుడ్‌ బ్యూటీ పేరంటే చాలా మందికి ఇష్టం. అయితే, జాన్వీకు ఈ పేరు పెట్టడం వెనుక ఓ క్యూట్‌ స్టోరీ ఉంది. 1997లో శ్రీదేవి, అనిల్‌ కపూర్‌ కలిసి ‘జుదాయి’ అనే సినిమాలో నటించారు. దీన్ని బోనీ కపూర్‌ నిర్మించారు. ఆ సినిమాలో ఊర్మిళ మతోంద్కర్‌ కూడా కీలకపాత్ర పోషించారు. ఆ పాత్ర పేరు జాన్వీ. ఈ పేరంటే శ్రీదేవి, బోనీకు చాలా ఇష్టమట. వారి మొదటి బిడ్డకు ఈ పేరు పెట్టాలని ఆ సినిమా సమయంలోనే నిర్ణయించుకున్నారట. అలా కుదిరిన పేరే జాన్వీ కపూర్‌.

జాన్వీకపూర్‌ లేటెస్ట్‌ స్టిల్స్‌.. ఆసక్తికర విషయాలు..

తండ్రికి తెలియకుండా టూర్‌..

ఒక టాక్ షోలో జాన్వీ తండ్రికి తెలియకుండా చేసిన ప్రయాణం గురించి చెప్పింది. ‘నేను నాన్నకు అబద్ధం చెప్పి లాస్‌ వెగాస్‌ వెళ్లాను. సినిమాకు వెళ్తున్నానని చెప్పి విమానంలో వెగాస్‌ వెళ్లాను. అక్కడ కొంతసమయం గడిపి వెంటనే రిటన్ అయ్యాను. ఆ ప్రయాణం ఎంతో థ్రిల్‌ను అందించింది’ అని నవ్వేసింది.

జాన్వీ పెళ్లిలో ఇవే వంటకాలు..

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ తన పెళ్లి గురించి వివరించింది. ‘నా పెళ్లి  కచ్చితంగా తిరుపతిలోనే సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. నేను కాంచీవరం జరీ చీరను కట్టుకుంటాను. వివాహం తర్వాత ఇష్టపడే అన్ని దక్షిణాది వంటకాలతో దావత్‌ ఇస్తాను. ఇడ్లీ, సాంబార్‌, పెరుగన్నం ఇలాంటివన్నీ ఉంటాయి’ అని తెలిపింది.

స్నేహితులకు దూరమయ్యాను..

అసభ్యకర రీతిలో ఫొటోమార్ఫింగ్‌ చేయడం వల్ల తను పాపులర్‌ అవ్వడానికి బదులు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నట్లు తన పాఠశాల రోజులను ఓ సందర్భంలో గుర్తు చేసుకుంది జాన్వీ. ‘కెమెరాలు, ఫొటోగ్రాఫర్స్‌ ఇవన్నీ చిన్నతనం నుంచి నా జీవితంలో ఒక భాగం. నాకు 10సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోను ఓ వెబ్‌సైట్‌లో మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేశారు. దాన్ని చూసి నేను షాక్‌ అయ్యాను. ఈ అసభ్యకరమైన చిత్రాల వల్ల నేను పాపులర్‌ అవ్వడానికి బదులు నా స్నేహితులకు దూరమయ్యాను’ అని చెప్పి బాధపడింది.  

మొదటి బాయ్‌ ఫ్రెండ్‌తో ముగిసిన బంధం..

‘‘నేను, నా మొదటి బాయ్ ఫ్రెండ్‌ రహస్యంగా కలుసుకునే వాళ్లం. మేమిద్దరం ఒకరితో ఒకరం చాలా అబద్ధాలు చెప్పుకొనేవాళ్లం. దురదృష్టవశాత్తూ.. నేను చెప్పిన ఓ అబద్ధం కారణంగా ఆ రిలేషన్ ముగిసింది. అలాగే బాయ్ ఫ్రెండ్‌ ఉండకూడదని నా తల్లిదండ్రులు కూడా చెప్పారు. వాళ్లతో నిజాయతీగా ఉంటే అన్నీ సులభంగా మారతాయని అర్థం చేసుకున్నా. పేరంట్స్‌ నిర్ణయాలకు అనుగుణంగా వెళితే భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం’’ అంటూ తన మొదటి బాయ్‌ ఫ్రెండ్‌ గురించి జాన్వీ ఓ టాక్‌షోలో చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని