Janhvi Kapoor: నాకు తెలియకుండా వారంలో పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్‌

తన పెళ్లిపై సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలపై జాన్వీ కపూర్‌ స్పందించారు. 

Updated : 29 May 2024 10:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో తరచూ షేర్‌ అవుతుంటాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై వచ్చిన రూమర్స్‌కు చెక్‌ పెట్టారు.

‘ఇటీవల నా పెళ్లికి సంబంధించిన వార్తలు కొన్ని చదివాను. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారు. పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన రెండు, మూడు కథనాలు మిక్స్‌ చేసి అలా రాశారు. నాకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా’ అని చెప్పారు. దీంతో ఈ వార్తలకు చెక్‌ పడినట్లు అయింది. ఇక ఇటీవల జాన్వీ (Janhvi Kapoor) పెళ్లిపై ఓ నెటిజన్ పోస్ట్‌ పెట్టగా.. దానికి ఆమె రియాక్ట్‌ అయ్యారు. ‘ఏదైనా రాస్తారా..’ అని రిప్లై పెట్టారు.

‘పుష్ప 2’ పోస్టర్‌తో రష్మిక.. నేహాశెట్టి ‘ఎల్లో సీజన్‌’!

మరోవైపు జాన్వీ తాజాగా సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ రెడిట్‌(Reddit)లో యూజర్లతో చిట్‌చాట్‌ చేశారు. ఇందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై వైరల్‌గా మారింది. ‘మనం డేట్‌కు వెళ్దామా? అది మంచి స్టోరీ అవుతుంది’ అని ఓ యూజర్‌ అడగ్గా దానికి జాన్వీ సరదాగా స్పందించారు. ‘నువ్వు గొడ్డలితో నరికి చంపేసే హంతకుడివి అయితే ఎలా?’ అన్నారు. రెడిట్‌ను తనకంటే తన చెల్లి ఖుషీనే ఎక్కువగా వాడుతుందని చెప్పారు. ఇందులో విశేషాలు చెల్లిని అడిగి తెలుసుకుంటానని జాన్వీ వెల్లడించారు. సోషల్‌ మీడియా అంటే భయమని ఈ ‘దేవర’ భామ తెలిపారు.

 జాన్వీ ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr and Mrs Mahi) ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే31న ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితో పాటు తెలుగులోనూ రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని