Janhvi Kapoor: ఒకే వేదికపై జాన్వీ - ఖుషీ డ్యాన్స్.. నెటిజన్ల రియాక్షనిదే

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకల్లో జాన్వీ కపూర్‌ డ్యాన్స్‌ వైరల్‌గా మారింది.

Updated : 03 Mar 2024 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తన చెల్లి ఖుషీ కపూర్‌తో కలిసి ఫేమస్‌ పాటకు డ్యాన్స్‌ చేశారు. వీళ్లిద్దరితో పాటు అనన్య పాండే, సారా అలీఖాన్‌ కూడా కలవడంతో ఈ నలుగురి ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జామ్‌నగర్‌ వేదికగా భారత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ (Anant Ambani), ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో స్టార్స్‌ అందరూ డ్యాన్స్‌లు చేస్తూ అతిథిల్లో జోష్ నింపుతున్నారు.

అంబానీ ఈవెంట్‌లో ‘నాటునాటు’ పాట.. స్టెప్పేసిన బాలీవుడ్‌ త్రయం

ఇందులో భాగంగానే బాలీవుడ్‌ హీరోయిన్స్‌ జాన్వీ, ఖుషీ, సారా అలీఖాన్‌, అనన్య పాండేలు డ్యాన్స్‌ చేశారు. హిందీ చిత్రం ‘కభీ ఖుషీ కభీ గమ్’లోని ‘బోలె చూడియాన్‌ బోలే కంగనా’ పాటకు ఈ నలుగురు  ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ మనీశ్‌ మల్హోత్రా కలిసి కలర్‌ఫుల్‌ ప్రదర్శన ఇచ్చారు. ఇది చూసిన వారంతా జాన్వీ గ్రేస్‌ఫుల్‌గా చేసిందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ వేడుకల్లో ఇదే బెస్ట్‌ డ్యాన్స్ అంటున్నారు. అలాగే, బాలీవుడ్‌ హీరోలతో కలిసి రామ్‌ చరణ్‌ ‘నాటునాటు’ స్టెప్‌ వేశారు. మొదట షారుక్‌, సల్మాన్‌, ఆమిర్‌లు ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ను షారుక్‌ స్టేజ్‌ మీదకు రావాలంటూ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఈవెంట్‌ సందర్భంగా సినీ తారలతో జామ్‌నగర్‌ కళకళలాడుతోంది. సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేస్తున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని