Katrina Kaif: టవల్‌ ఫైట్‌ సీక్వెన్స్‌.. ఆ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న కత్రినా కైఫ్‌

సౌదీ అరేబియాలో జరిగిన రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు నటి కత్రినా కైఫ్‌ (Katrina Kaif). ఇటీవల తాను నటించిన ‘టైగర్‌ 3’కు సంబంధించిన విశేషాలను ఆమె పంచుకున్నారు.

Published : 06 Dec 2023 15:46 IST

ముంబయి: సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) - కత్రినాకైఫ్‌ (Katrina Kaif) జంటగా నటించిన చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). మనీశ్‌ శర్మ దర్శకుడు. ‘టైగర్‌’ ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నవంబర్‌ 12న విడుదలై అంతటా పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కత్రినాకైఫ్‌, హాలీవుడ్‌ నటి మిచెల్‌ లీపై చిత్రీకరించిన టవల్‌ ఫైట్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న కత్రిన ఈ ఫైట్ సీక్వెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘టైగర్‌ 3’లోని కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు అద్భుతం. ముఖ్యంగా టవల్‌ ఫైట్‌ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌లో భాగంగా నా కోసం ఒక డూప్‌ను సిద్ధం చేశారు. ఆమె ఎంతో తీవ్రంగా శ్రమించింది. షూట్‌ సమయంలో ఆమె అనారోగ్యానికి గురైంది. ఏం చేయాలో పాలుపోక దర్శక నిర్మాతల వద్దకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా. ‘నువ్వు చేయాల్సిందే’ అని చెప్పారు. దాంతో నేను ధైర్యంగా ముందడుగు వేశా’’ అని చెప్పారు.

Priyanka Chopra: డీప్‌ ఫేక్‌ బారిన ప్రియాంక చోప్రా.. నకిలీ వీడియో వైరల్‌

ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ గురించి గతంలో మిచెలీ మాట్లాడుతూ.. ‘‘కత్రినతో ఆ ఫైట్‌ సీన్‌ను ఎలా చేయాలి, ప్రేక్షకులను దానికి ఎలా కనెక్ట్‌ చేయాలనే దానిపై దృష్టి పెట్టాం. యాక్షన్‌ సీక్వెన్స్‌ డిజైన్‌ చేసిన తీరు అద్భుతం. కత్రిన ఎంతో కష్టపడింది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని