krishnamma: సైలెంట్‌గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

‘కృష్ణమ్మ’ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 17 May 2024 10:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్య కథలను ఎంచుకునే సత్యదేవ్ హీరోగా వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించిన సినిమా ‘కృష్ణమ్మ’ (krishnamma). ప్రచార చిత్రాలతో ఆసక్తి పెంచిన ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (amazon prime video) వేదికగా మే17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అర్చన అయ్యర్ నటించిన ఈ సినిమాలో లక్ష్మణ్‌ మీసాల, కృష్ణ బురుగుల, అతీరా రాజ్, రఘు కుంచె కీలక పాత్రలు పోషించారు.

ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ

కథేంటంటే: అనాథలైన భద్ర (సత్యదేవ్‌), శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్‌ మీసాల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ బయటకొచ్చాక ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్మగ్లింగ్‌ చేస్తుంటారు. వీళ్లంతా తమకంటూ ఓ కుటుంబం ఉండాలని ఆశ పడతారు. ఈ క్రమంలోనే మీనా (అతీరా రాజ్‌)తో శివ ప్రేమలో పడతాడు. ఆమె భద్రకు రాఖీ కట్టడంతో తనూ ఆమెను సొంత చెల్లిగా చూడటం మొదలు పెడతాడు. అయితే ఓసారి మీనా తల్లి ఆపరేషన్‌కు రూ.2లక్షలు అవసరమైతే.. ఆ డబ్బు సంపాదించడం కోసం భద్ర, శివ, కోటి తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి స్మగ్లింగ్‌ చేయడానికి సిద్ధపడతారు. అలా వాళ్లు పాడేరు నుంచి వైజాగ్‌కు గంజాయి తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్లు అనుకోకుండా ఓ యువతి అత్యాచారం కేసులోనూ ఇరుక్కుంటారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ అత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు