Priyanka Chopra: ప్రియాంకా- నిక్‌ జొనాస్‌ల ఏజ్‌ గ్యాప్‌.. మధు చోప్రా ఏమన్నారంటే!

ప్రియాంకా- నిక్‌ జొనాస్‌ల ఏజ్‌ గ్యాప్‌పై మధు చోప్రా స్పందించారు. తాను ఈ విషయం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.

Published : 29 May 2024 14:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), ఆమె భర్త నిక్‌ జొనాస్‌ కంటే వయసులో పెద్దదనే విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పదేళ్ల తేడా ఉంది. ఇదే విషయంపై తాజాగా ప్రియాంక తల్లి మధుచోప్రా (Madhu Chopra) మాట్లాడారు. ఇద్దరూ సంతోషంగా ఉంటున్నప్పుడు వయసు వ్యత్యాసం పెద్ద విషయమేమీ కాదన్నారు.

‘నిక్‌ జొనాస్‌ మంచివాడు. ప్రియాంక అతడితో ఆనందంగా ఉంది. నేను వారి మధ్య అన్యోన్యతను మాత్రమే చూశా. ప్రజలు మాత్రం వాళ్లిద్దరి మధ్య ఉన్న ఏజ్‌గ్యాప్‌ గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రియాంక (Priyanka Chopra) ప్రేమిస్తున్న సంగతిని నేను టీవీలో, న్యూస్‌ పేపర్లలో చూసి తెలుసుకున్నా. అప్పుడు తనను అడిగితే.. ప్రేమలాంటిదేం లేదని చెప్పింది. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ముందే తెలియజేస్తానన్నది. నిక్‌ (Nick Jonas) చాలా హుందాగా ఉండేవాడు. అందుకే వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనే ఆలోచన నాకు రాలేదు. ఒకరోజు నిక్‌ నన్ను హోటల్‌కు తీసుకెళ్లి ప్రియాంకకు కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటున్నారని  అడిగాడు. నేను అనుకున్న అర్హతలన్నీ చెప్పాను. ‘నేను ఆ వ్యక్తిని కాగలనా. నాకు ఆ అర్హతలు ఉన్నాయి. ప్రియాంకను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని మాటిస్తున్నా’ అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. వెంటనే ఓకే చెప్పా’ అని తెలిపారు. 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంకా- నిక్‌ జొనాస్‌లు 2022లో తల్లిదండ్రులయ్యారు. వారి కుమార్తెకు మాల్తీ మారీ చోప్రా జోనాస్‌ అనే పేరు పెట్టారు.

‘టిల్లు 3’లో రాధిక పాత్ర ఉంటుందా.. నేహాశెట్టి ఏం చెప్పారంటే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని