Tillu3: ‘టిల్లు 3’లో రాధిక పాత్ర ఉంటుందా.. నేహాశెట్టి ఏం చెప్పారంటే!

‘టిల్లు 3’లో తన పాత్ర ఉంటుందా లేదా అనే విషయంపై నేహాశెట్టి (Neha Shetty) మాట్లాడారు. ఇప్పటి వరకు తాను చేసిన పాత్రల గురించి చెప్పారు.

Published : 29 May 2024 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని చిత్రాల్లోని పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాంటి పాత్రల్లో ఒకటి ‘డీజే టిల్లు’లో రాధిక. సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రాధికగా హీరోయిన్ నేహాశెట్టి అలరించారు. దీని సీక్వెల్‌ ‘టిల్లు స్వ్కేర్‌’లో హీరోయిన్‌ పాత్రలో లిల్లీగా అనుపమ పరమేశ్వరన్‌ నటించగా.. రాధిక పాత్రలో కొన్ని సన్నివేశాల్లో నేహాశెట్టి తళుక్కున మెరిశారు. ఈ రెండు చిత్రాలు విజయం సాధించడంతో ‘టిల్లు 3’ (Tillu3)ని కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేహాశెట్టి మూడో పార్ట్‌లో తన పాత్ర ఉంటుందా లేదా అనే విషయంపై మాట్లాడారు.

ఈ రెండు సినిమాలు టాలీవుడ్‌ స్థాయిని పెంచుతాయి : పరుచూరి గోపాల కృష్ణ

‘మేకర్స్‌ రాధిక పాత్రను ఇంకా చూపించాలనుకుంటే కంటిన్యూ చేస్తారు. దర్శకులు నాకు ఇచ్చిన డైలాగులను ఎంత అందంగా చెప్పాలనేదాని గురించే ఆలోచిస్తాను. సన్నివేశాలకు తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందుగా తెలుసుకోను. అలాగే ‘టిల్లు స్క్వేర్‌’లో రాధిక బెంగళూర్‌ వెళ్లినట్లు చూపించారు. అక్కడకు వెళ్లిన తర్వాత వేరే పెళ్లి చేసుకుంటుందా.. లేదంటే టిల్లు కోసం తిరిగి వచ్చేస్తుందా అనేది చెప్పలేం’ అంటూ ఆసక్తి పెంచేశారు నేహాశెట్టి  (Neha Shetty). ఇక ఇప్పటి వరకు తాను చేసిన పాత్రల గురించి మాట్లాడుతూ.. ‘‘డీజే టిల్లు’లో రాధిక పాత్ర ఈ తరానికి సరిపోయేది. ‘బెదురులంక’లో చిత్ర ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. తను కూడా ఈతరానికి చెందిన అమ్మాయిలానే ఉంటుంది.  ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో బుజ్జి హుందాగా ఉంటుంది. అలానే చాలా స్ట్రాంగ్‌. ఎప్పుడు ఎలా ఉండాలో.. ఎక్కడ ఎలా నడుచుకోవాలో తనకు తెలుసు. ప్రతి అమ్మాయికీ ఈ పాత్ర నచ్చుతుంది. సమాజం కోసం  ఇష్టంలేని పనులు కూడా చేయడానికి సిద్ధమవుతుంది’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని