Mahesh Babu: ప్రతి జ్ఞాపకంలోనూ మీరుంటారు.. తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేశ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

కృష్ణ జయంతి సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయన్ని తలచుకుంటున్నారు. మహేశ్‌ బాబు  ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

Updated : 31 May 2024 12:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన నటుడు కృష్ణ. అర్ధ శతాబ్దం పాటు తన సత్తా చాటిన ఈ లెజెండరీ నటుడి జయంతి నేడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయన్ని గుర్తుచేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక తన తండ్రిని తలచుకుంటూ మహేశ్‌ బాబు (Mahesh babu) ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని ప్రతి క్షణం మిస్‌ అవుతున్నాను. నా ప్రతి జ్ఞాపకంలోనూ మీరు ఎప్పటికీ జీవించే ఉంటారు’ అంటూ కృష్ణ యంగ్‌ లుక్‌లో ఉన్నప్పటి ఫొటోను మహేశ్‌బాబు పంచుకున్నారు. హీరో సుధీర్‌ బాబు (Sudheer Babu) కూడా కృష్ణను తలచుకుంటూ పోస్ట్‌ పెట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే మామయ్య. మీ పక్కన కూర్చొని ‘హరోం హర’ చూడాలనుంది. నేను ఇలాంటి యాక్షన్‌ సినిమాలో నటించాలని మీరు ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఈ సినిమా మీకోసమే చేశాను. మీరు గర్వపడేలా చేస్తానని హామీ ఇస్తున్నాను’ అని రాసుకొచ్చారు.

అశోక్‌ గల్లా కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ఈ సినిమాలోని రెండో పాటను కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ‘జై బోలో కృష్ణ’ అంటూ సాగే ఈ పాటను ఆయనకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

బాలకృష్ణతో నాకు మంచి అనుబంధం ఉంది: నటి అంజలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని