Mirzapur3: ‘మీర్జాపూర్‌ 3’ ఓటీటీలో వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘మీర్జాపూర్‌ 3’ (Mirzapur3) విడుదలకు సిద్ధమైంది.

Updated : 11 Jun 2024 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ (Mirzapur) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించడంతో.. మూడోదాని కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు. దీని స్ట్రీమింగ్‌ తేదీని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) ప్రకటించింది. జులై 5 నుంచి ప్రసారం కానున్నట్లు తెలిపింది. దీని షూటింగ్‌ పూర్తయినట్లు ఏడాది క్రితమే నటీనటులు వెల్లడించారు. అప్పటి నుంచి స్ట్రీమింగ్‌ తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దాన్ని ప్రకటించడంతో వారంతా సంబర పడుతున్నారు. దీని రెండో సీజన్‌ విడుదలై మూడేళ్లు గడిచినా అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్‌లో సందడి చేస్తూనే ఉన్నాయి.

దళపతి విజయ్‌ మంచి మనసు.. వారికి సన్మానం చేయనున్న హీరో

క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లకు గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించారు. దానికి మంచి స్పందన లభించింది. దీంతో దానికి సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ (Mirzapur 2) విడుదలైంది. ఇదీ విశేష ఆదరణ అందుకుంది. తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. రెండో సీజన్‌లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. ఇందులో విజయ్ వర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవల టీజర్‌ రిలీజ్‌ సందర్భంగా అలీ ఫజల్‌ మాట్లాడుతూ.. మూడో సీజన్‌లో (Mirzapur3) ఎన్నో కొత్త పాత్రలను పరిచయం చేయనున్నట్లు చెప్పారు. గత రెండు సీజన్లతో పోలిస్తే మూడో సీజన్‌ ఉత్కంఠభరితంగా ఉంటుందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని