My Name Is Shruthi: మరో ఓటీటీలోకి హన్సిక క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

Published : 26 Feb 2024 14:32 IST

హైదరాబాద్‌: హ‌న్సిక (Hansika) ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్‌ ‘మై నేమ్ ఈజ్ శృతి’ (My Name Is Shruthi). స్కిన్‌ మాఫియా కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం మరో ఓటీటీలోనూ వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ మూవీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముర‌ళీశ‌ర్మ, పూజా రామ‌చంద్ర‌న్‌, ప్రేమ‌, రాజీవ్ క‌న‌కాల కీలక పాత్రల్లో నటించారు.

క‌థేంటంటే: శృతి (హ‌న్సిక‌) యాడ్ ఏజెన్సీలో ఉద్యోగి. చిన్న‌ప్పుడే తండ్రి చ‌నిపోవ‌డంతో తాత, అమ్మ పెంప‌కంలో పెద్ద‌దవుతుంది. చరణ్ ( సాయి తేజ)తో ప్రేమలో ఉన్న ఆమె జీవితం అంతా సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఎమ్మెల్యే గురుమూర్తి (న‌రేన్‌) ముఠా వ‌ల‌లో చిక్కుకుంటుంది. స్కిన్ మాఫియా ముఠాలో కీలకమైన గురుమూర్తి చేస్తున్న దారుణాల‌న్నీ శృతికి తెలుస్తాయి. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలేమిటి? ఈ స్కిన్ మాఫియా ముఠా వెన‌క ఎవ‌రున్నారు? ఎవరెవరు ఇందులో భాగం అయ్యారు? ఈ ముఠాపై శృతి పోరాటం ఎలా చేసిందన్నది కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని