Naga Chaitanya: టెక్నాలజీ చూస్తే భయమేస్తోంది.. రష్మిక మార్ఫింగ్‌ వీడియోపై నాగచైతన్య

వైరలవుతోన్న నటి రష్మిక (Rashmika) ఫేక్‌ వీడియోపై నాగచైతన్య స్పందించారు. భవిష్యత్తులో టెక్నాలజీలో వస్తున్న మార్పులను తలచుకుంటే భయమేస్తుందన్నారు.

Updated : 07 Nov 2023 11:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్: హీరోయిన్ రష్మిక (Rashmika) మార్ఫింగ్ వీడియో అంశం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇది చాలా దారుణ చర్య అని  ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. తాజగా ఈ వీడియోపై నటుడు నాగచైతన్య (Naga Chaitanya) ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే ఎంతో నిరుత్సాహం కలుగుతోంది. భవిష్యత్తులో రాబోయే మార్పులను తలచుకుంటే మరింత భయమేస్తోంది. బాధితులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కొత్త చట్టాన్ని తీసుకురావాలి’ అని రాసుకొచ్చారు. రష్మికకు ధైర్యం చెప్పారు. ఇక ఈ పోస్ట్‌కు రష్మిక స్పందిస్తూ థ్యాంక్యూ అని రిప్లై పెట్టారు. అలాగే గాయని చిన్మయి కూడా ఈ వీడియోపై పోస్ట్ పెట్టారు. ఇలాంటివి చాలా ప్రమాదకరమన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఫేక్‌ వీడియోలను అరికట్టాలని కోరారు.

ఇక ఈ విషయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ రష్మిక ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోను తప్పుపడుతూ భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన పోస్ట్‌కు రష్మిక స్పందిస్తూ.. ‘మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు మేడం’ అని అన్నారు. ఇక ఈ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్ఫింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య అని పేర్కొన్న ఐటీ శాఖ.. 36 గంటల్లోపు దీన్ని తొలగించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

నాకెంతో బాధగా ఉంది: మార్ఫింగ్‌ వీడియోపై రష్మిక పోస్ట్‌

మీ వల్లే ఈ దేశంలో సురక్షితంగా ఉన్నాను..: రష్మిక

ఇక ఈ ఫేక్ వీడియోపై మొదట స్పందించిన నటుడు అమితాబ్‌కు రష్మిక ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ‘నా కోసం మద్దతుగా నిలబడినందుకు ధన్యవాదాలు. మీలాంటి వారు ఉన్న దేశంలో నేను సురక్షితంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని