Sreeleela: శ్రీలీల కొత్త టాలెంట్‌.. మనసు పారేసుకుంటోన్న నెటిజన్లు

తనలోని మరో టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు నటి శ్రీలీల (Sree Leela). ఆమెను మెచ్చుకుంటూ నెటిజన్లు వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు.

Published : 27 Aug 2023 12:01 IST

హైదరాబాద్‌: నటి శ్రీలీల (Sreeleela) అంటే సినీ ప్రియులకు టక్కున గుర్తుకువచ్చేది ఆమె డ్యాన్స్‌. పాట ఏదైనా సరే హీరోకి ఏమాత్రం తగ్గకుండా.. కొన్నిసార్లు హీరోలను మించి డ్యాన్స్‌ చేస్తారీ బ్యూటీ. తాజాగా ఆమె తనలోని మరో టాలెంట్‌ను తెలుగువారికి పరిచయం చేశారు.

శ్రీలీల కథానాయికగా నటించిన కొత్త చిత్రం ‘స్కంద’ (Skanda). రామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో శ్రీలీల పాట పాడి అలరించారు. తమన్‌ (Thaman) బృందంతో కలిసి ‘స్కంద’లోని ‘నీ చుట్టు చుట్టు’ పాటను ఆలపించారు. అభిమానులతోపాటు రామ్‌, ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ (Balakrishna) సైతం ఆమె పాటను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.

Vijay Deverakonda: ‘అది నా పిల్ల’.. ఇదొక ఎమోషన్‌: విజయ్‌ దేవరకొండ

అనంతరం లవ్‌ ప్రపోజల్స్‌ గురించి ‘‘చూడొచ్చేమో.. ఉంటుందేమో’’ అంటూ శ్రీలీల క్యూట్‌గా మాట్లాడారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘లూప్‌ మోడ్‌లో పాటను వింటున్నా’, ‘ఎంత క్యూట్‌గా మాట్లాడుతున్నారో’ అంటూ పలువురు కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. ఇదే ఫంక్షన్‌లో శ్రీలీలను ఉద్దేశిస్తూ బాలయ్య హిందీలో మాట్లాడి అలరించారు. ‘జైలర్‌’లోని ‘హుకుం’ పాట పాడిన రామ్‌.. ఇది బాలయ్యకు బాగా సరిపోతుందని చెప్పారు.

‘వారియర్‌’ తర్వాత రామ్‌ నటిస్తోన్న చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకుడు. శ్రీలీల కథానాయిక. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్‌ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు.Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని