Vijay Deverakonda: ‘అది నా పిల్ల’.. ఇదొక ఎమోషన్‌: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) తాజాగా చేసిన ఓ ట్వీట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

Published : 27 Aug 2023 10:48 IST

హైదరాబాద్‌: తన తదుపరి చిత్రం ‘ఖుషి’ (Kushi)లోని ఓ డైలాగ్‌ను ఉద్దేశిస్తూ నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. సినిమాలోని ఓ సన్నివేశంలో సమంత (Samantha)ను చూసి.. ‘అది నా పిల్ల’ అంటూ విజయ్‌ దేవరకొండ చెబుతారు. ఈ డైలాగ్‌ ఒక ఎమోషన్‌ అంటూ సరదాగా చెప్పారు. ఇదే డైలాగ్‌పై ఆయన సోదరుడు, నటుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) సైతం స్పందించారు. ఈ బ్రదర్స్‌ ఇద్దరూ ప్రత్యేకంగా ఈ సంభాషణ గురించే మాట్లాడటానికి కారణం ఏమిటంటే..?

విజయ్‌ ప్రస్తుతం ‘ఖుషి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఉద్దేశిస్తూ నెటిజన్లు క్రియేట్‌ చేస్తున్న సరదా మీమ్స్‌, ఆసక్తికర వీడియోలపై సోషల్‌మీడియా వేదికగా ఆయన స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ ‘ఖుషి’లో విజయ్‌ చెప్పే ‘అది నా పిల్ల’ డైలాగ్‌ను..‘బేబీ’ (Baby)లోని ఓ సన్నివేశంలో ‘అది నా పిల్లరా’ అంటూ ఆనంద్‌  భావోద్వేగానికి గురయ్యే సీన్‌ను యాడ్‌ చేశాడు. ‘‘ఆకలేసిన వాడు ఒకరకంగా అంటాడు.. ఎదురుదెబ్బ తగిలినవాడు ఒకరకంగా అంటాడు’’ అని ‘కింగ్‌’లో బ్రహ్మానందం చెప్పే ఫన్నీ డైలాగ్‌ మిక్స్‌ చేసి సరదా వీడియో చేశాడు. దీనిపై విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. ‘‘అది నా పిల్ల.. ఇదొక ఎమోషన్‌’’ అని నవ్వులు పూయించారు. ఆనంద్‌ స్పందిస్తూ.. ‘‘ట్విటర్‌ అప్పుడప్పుడూ ఇలాంటి రత్నాలను వెలికి తీస్తుంది’’ అని సరదాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Social Look: బాత్‌ టబ్‌లో రష్మి.. బికినీలో రుహాని

విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటించిన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్‌ 1న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బేబీ’ విషయానికి వస్తే.. ఆనంద్‌, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. సాయి రాజేశ్‌ దర్శకుడు. థియేటర్‌లో ఘన విజయాన్ని అందుకున్న ఈసినిమా తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని