PV Narasimha Rao biopic: వెబ్‌ సిరీస్‌గా పీవీ నరసింహరావు బయోపిక్‌.. ఏయే అంశాలు చూపనున్నారంటే!

పీవీ నరసింహరావు బయోపిక్‌ వెబ్‌సిరీస్‌గా తీసుకురానున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది.

Published : 28 Feb 2024 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీరంగంలో బయోపిక్‌లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రలు తెరకెక్కి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో ప్రముఖ రాజకీయ నాయకుడి జీవితం ఆహా (aha) వేదికగా వెబ్‌ సిరీస్ రూపంలో రానుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు (P.V.Narasimha Rao) జీవిత చరిత్ర వెబ్‌ సిరీస్‌గా త్వరలోనే రూపుదిద్దుకోనుంది. 

ఈ విషయాన్ని గతంలోనే ఆహా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ సిరీస్‌పై పోస్ట్‌ పెట్టింది. ఈ బయోపిక్‌ను రూపొందించడం ఎంతో గర్వంగా, ఉత్సాహంగా ఉందని పేర్కొంది. వినయ్‌ సీతాపతి రాసిన ‘ది హాఫ్‌ లయన్‌’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ప్రకాశ్‌ ఝా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఆహా స్టూడియో, అప్లాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆహా తాజాగా పంచుకుంది.

మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్‌ తేజ్‌ అలా.. ‘టిల్లు’ ఇలా!

ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన సంస్కరణలను ఈ సిరీస్‌లో చూపనున్నారు. పీవీ రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతంలో ఈ సిరీస్ గురించి ప్రకాశ్‌ ఝూ మాట్లాడుతూ.. పీవీ నవభారతాన్ని నిర్మించిన నాయకుడని కొనియాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దీన్ని ఎన్నో ఆసక్తికర అంశాలతో రూపొందించనున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని