Pushpa 2: బాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పఠాన్’, ‘టైగర్3’ కాదట!
ఓర్‌మ్యాక్స్ మీడియా నివేదిక ప్రకారం 2023లో బాలీవుడ్ ఎదురుచూస్తున్న ఆసక్తికర చిత్రం ఇదే.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఏదో తెలుసా? ఇటీవల వచ్చిన ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’తో మెప్పించలేకపోయారు కాబట్టి, షారుఖ్ ‘పఠాన్’, సల్మాన్ ‘టైగర్3’ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటుపడినట్లే. మరి ఆ చిత్రం ఏంటంటే, అల్లు అర్జున్ ‘పుష్ప2’. తాజాగా ఓర్‌మ్యాక్స్ మీడియా నివేదిక ప్రకారం 2023లో బాలీవుడ్ ఎదురుచూస్తున్న ఆసక్తికర చిత్రం ఇదే.
గతేడాది వచ్చిన విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ తెలుగుతో పాటు, బాలీవుడ్‌లోనూ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బన్ని స్టైల్, మేనరిజమ్స్‌కు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా, ‘పుష్ప: ది రూల్’ రాబోతోంది. దీని కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు, బాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఓర్మ్యాక్ మీడియా నివేదిక చెబుతోంది. ‘పుష్ప2’ తర్వాత ‘పఠాన్’, ‘టైగర్3’ ఉన్నాయి. ఆ తర్వాత ‘జవాన్’, ‘డంకీ’ చిత్రాలు ఉండటం గమనార్హం. మరోవైపు ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన వర్క్‌ను దర్శకుడు సుకుమార్ మొదలు పెట్టారు. ఇటీవల ఫొటోషూట్ నిర్వహించారు. అన్నీ కుదిరితే దీపావళి కానుకగా చిత్ర బృందం సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?