Ram Charan: ఆట తుది దశకు

‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం మరోసారి రంగంలోకి దిగనున్నారు రామ్‌చరణ్‌. ఈ నెల 11 నుంచి హైదరాబాద్‌లో కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు.

Updated : 10 Jul 2023 14:11 IST

‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం మరోసారి రంగంలోకి దిగనున్నారు రామ్‌చరణ్‌. ఈ నెల 11 నుంచి హైదరాబాద్‌లో కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. అందుకోసం చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. శంకర్‌ దర్శకత్వంలో... రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రమిది. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినీ  క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దక్షిణాదిలో రూపొందుతున్న మరో భారీ పాన్‌ ఇండియా సినిమాగా ‘గేమ్‌ ఛేంజర్‌’ పరిశ్రమ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. అంజలి, శ్రీకాంత్‌, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, సునీల్‌, నవీన్‌ చంద్ర తదితరులు నటిస్తున్నారు.

చరణ్‌ చిత్రంలో విజయ్‌ సేతుపతి?

‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ చేయనున్న సినిమా ఖరారైన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమా త్వరలోనే మొదలు కానుంది. అందులో కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతిని సంప్రదించినట్టు సమాచారం. బుచ్చిబాబు సానా తొలి చిత్రం ‘ఉప్పెన’లో కూడా విజయ్‌ సేతుపతి నటించారు. రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు కలయికలో సినిమాకి సంబంధించి కొన్ని రోజులుగా పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఫుట్‌బాల్‌ నేపథ్యంలో సాగనున్న ఈ  చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూర్చనున్నట్టు ప్రచారం సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని