Ram: అట్లీ దంపతులకు థ్యాంక్స్‌ చెప్పిన రామ్ పోతినేని.. ఎందుకంటే?

హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘స్కంద’ (Skanda). ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 25 Sep 2023 11:05 IST

హైదరాబాద్‌:  ‘స్కంద’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni). బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం జోరు పెంచారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. బాలీవుడ్‌ హీరోలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

షారుక్‌ ఖాన్‌ను (Shah Rukh Khan) ఇటీవల తాను కలిసినట్లు రామ్‌ చెప్పారు. ‘‘అట్లీ దంపతులు నాకు మంచి స్నేహితులు. వాళ్లే నన్ను షారుక్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఇందుకు వాళ్లకు కృతజ్ఞతలు. ఇక షారుక్‌ చాలా మంచి వ్యక్తి. ఆయన్ని కలిసినప్పుడు ఎంతో మర్యాదగా వ్యవహరించారు. నా గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరం సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన ‘స్కంద’ ట్రైలర్‌ పంపమని అడిగారు’’ అని రామ్‌ పోతినేని చెప్పారు. 

సెప్టెంబరు ఆఖరివారం.. అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?

అలాగే తాను కలిసిన మొదటి బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) అని రామ్‌ తెలిపారు. ‘‘నేను చేసిన ‘రెడీ’ సినిమాను సల్మాన్‌ హిందీలో రిమేక్ చేశారు. నాకు జెనీలియా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కూడా స్నేహితులు. మేమంతా ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలో అక్కడకు సల్మాన్‌ వస్తున్నారని రితేశ్‌ చెప్పారు. నాకు కొత్త వాళ్లతో మాట్లాడాలంటే కొంచెం బిడియం ఎక్కువ. దీంతో సెట్‌ నుంచి వెళ్లిపోతానని చెప్పా. రితేశ్‌ నన్ను ఆపారు. సల్మాన్‌ రాగానే ఆయనకు నన్ను పరిచయం చేశారు. నన్ను చూడగానే ‘గుర్తున్నావు. రెడీలో బాగా చేశావు’ అని సల్మాన్‌ అన్నారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది’’ అని రామ్ గుర్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని