upcoming movies telugu: సెప్టెంబరు ఆఖరివారం.. అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?

upcoming movies: సెప్టెంబరు నెల ముగింపునకు వచ్చింది. ప్రభాస్‌ ‘సలార్‌’ విడుదల వాయిదా పడటంతో పలు తెలుగు చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్‌కు క్యూ కట్టాయి. మరోవైపు వరుస సెలవులు రావడంతో ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

Updated : 25 Sep 2023 09:51 IST

క్రేజీ కాంబినేషన్‌..

‘అఖండ’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్కంద’ (Skanda movie). రామ్‌ పోతినేని కథానాయకుడు. శ్రీలీల, సయీ మంజ్రేకర్‌ కథానాయికలు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో రామ్‌ రెండు కోణాల్లో కనిపించనున్నారు. మునుపెన్నడూ చూడని మాస్‌ గెటప్పుల్లో సందడి చేయనున్నారు’’ అని చిత్ర బృందం చెబుతోంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే, రామ్‌ను ఓ విభిన్న పాత్రలో చూపించినట్లు అర్థమవుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘స్కంద’ విడుదల కానుంది.


బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌..

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘చంద్రముఖి 2’ (chandramukhi 2). రజనీకాంత్‌ హిట్‌ సినిమా ‘చంద్రముఖి’కి కొనసాగింపుగా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 17ఏళ్ల క్రితం కోట నుంచి వెళ్లిపోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకొచ్చిందనే ఆసక్తికరం అంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. తొలి భాగంలో జ్యోతికను చంద్రముఖి ఆవహించగా, ఇందులో నిజమైన చంద్రముఖిగా కంగనా రనౌత్‌ నటించడం విశేషం.


ఈసారి ‘వ్యాక్సిన్‌ వార్‌’తో..

వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ వివాదాల మధ్య విడుదలైనా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ దర్శకుడు నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War). ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన సినిమాగా కరోనా నాటి పరిస్థితులను ఇందులో చూపించనున్నారు. ముఖ్యంగా వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్ప సేవలకు ఈ సినిమా నివాళులర్పించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. సెప్టెంబరు 28న ఈ చిత్రం విడుదల కానుంది.


పంథా మార్చిన శ్రీకాంత్‌ అడ్డాల

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి క్లాసిక్‌ మూవీలను తీసిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ‘నారప్ప’తో ఆయన తన పంథాను మార్చారు. తాజాగా విరాట్‌ కర్ణ కథానాయకుడిగా ఆయన రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పెదకాపు - 1’ (Peddha Kapu 1). ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

 • నెట్‌ఫ్లిక్స్‌
 • గాండీవధారి అర్జున (తెలుగు) సెప్టెంబరు 24

 • ద డెవిల్స్‌ ప్లాన్‌ (కొరియన్‌ సిరీస్‌) సెప్టెంబరు 26
 • కాసిల్వేనియా (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 28
 • ఐస్‌కోల్డ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 28
 • లవ్‌ ఈజ్‌ ఇన్‌ ది ఎయిర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 28
 • చూనా (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 29
 • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
 • ద ఫేక్‌ షేక్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 26
 • హాస్టల్ డేజ్‌ (హిందీ) సెప్టెంబరు 27
 • కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 28

 • జెన్‌ వి (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 29
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • కింగ్‌ ఆఫ్‌ కొత్త (మలయాళం) సెప్టెంబరు 28
 • లాంచ్‌పాడ్‌ (వెబ్‌సిరిస్‌2) సెప్టెంబరు 29
 • తుమ్‌ సే నహీ పాయేగా (హిందీ) సెప్టెంబరు 29
 • సోనీలివ్‌
 • ఏజెంట్‌ (తెలుగు) సెప్టెంబరు 29

 • అదియా (తమిళ్‌) సెప్టెంబరు 29
 • బుక్‌ మై షో
 • బ్లూ బీటిల్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 29
 • లయన్‌ గేట్‌ ప్లే
 • సింపథీ ఫర్‌ ది డెవిల్‌(హాలీవుడ్) సెప్టెంబరు 29
 • హైరిచ్‌
 • ఎన్నివర్‌ (మలయాళం) సెప్టెంబరు 29
 • క్రాంతి వీర (కన్నడ) సెప్టెంబరు 29
 • ఆహా
 • పాపం పసివాడు (తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 29

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని