Rashmika: ఒక నటిగా సందీప్‌ను ఎన్నోసార్లు ప్రశ్నించా..: రష్మిక

‘యానిమల్‌’ (Animal) సినిమా విడుదలై వారం రోజులైన సందర్భంగా నటి రష్మిక (Rashmika) తాజాగా ఓ పోస్ట్‌ పెట్టారు. ఇందులో తాను నటించిన గీతాంజలి పాత్ర చిత్రీకరణ గురించి పలు విషయాలు పంచుకున్నారు. 

Published : 09 Dec 2023 01:52 IST

హైదరాబాద్‌: ‘యానిమల్‌’ (Animal) చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు నటి రష్మిక (Rashmika). తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఇందులో తాను పోషించిన గీతాంజలి పాత్ర చిత్రీకరణ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. కుటుంబం మొత్తం కలిసి ఉండేలా చేసిన శక్తి గీతాంజలి అని ఆమె అన్నారు.

‘‘గీతాంజలి.. నేను గనక ఈ పాత్రను ఒక్క మాటలో వర్ణించాలనుకుంటే.. కుటుంబం మొత్తం కలిసి ఉండేలా చేసిన శక్తి ఆమేనని చెబుతా. తన మనసు ఎంతో స్వచ్ఛమైనది. అలాగే, ఆమె ధైర్యవంతురాలు కూడా. గీతాంజలి ఎందుకలా ప్రవర్తిస్తుందంటూ ఒక నటిగా ఎన్నో సందర్భాల్లో దర్శకుడిని ప్రశ్నించా. నా ప్రశ్నలకు సందీప్‌ వంగా చెప్పిన సమాధానం నాకింకా గుర్తుంది. ఇది రణ్‌విజయ్‌ - గీతాంజలిల కథ. వాళ్ల ప్రేమ.. కుటుంబం.. జీవితం.. అలాగే ఇదే వాళ్ల స్వభావం.

Social Look: శ్రీలీల ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’ ఫొటోలు.. కారులో రాశీఖన్నా సెల్ఫీ..!

హింస, బాధతో నిండిన ప్రపంచంలో శాంతి, నమ్మకం, ప్రశాంతతను గీతాంజలి తీసుకువచ్చింది. భర్త, పిల్లలు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలంటూ భగవంతుడిని కోరుకునేది. కుటుంబం కోసం తన శక్తి మేరకు ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని నిలబడిన శిల ఆమె. నా కళ్లతో చూస్తే.. గీతాంజలి ఎంతో అందమైన అమ్మాయి. తన కుటుంబాన్ని సంరక్షించుకోవడం కోసం ధైర్యంగా నిలబడే ఎంతోమంది మహిళల్లాంటిదే ఆమె కూడా’’ అని రష్మిక పోస్ట్‌ పెట్టారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. ప్రతి సినిమా కోసం మరింత కష్టపడేందుకు అభిమానుల ప్రేమ తోడ్పడుతుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని