Pushpa2: ఎన్నో బాధ్యతలుంటాయి.. ‘పుష్ప2’లో పాత్రపై రష్మిక కామెంట్స్‌

‘పుష్ప2’లో తన పాత్రపై రష్మిక కామెంట్స్‌ చేశారు. ఓ అవార్డు కార్యక్రమానికి హాజరయ్యేందుకు టోక్యో వెళ్లిన ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.

Published : 02 Mar 2024 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం తెలుగు ఆడియన్స్‌తో పాటు యావత్‌ సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule). అల్లు అర్జున్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప- ది రైజ్‌’కు సీక్వెల్‌గా ఇది రానుంది. మొదటిభాగంలో శ్రీవల్లిగా అలరించిన రష్మిక (Rashmika Mandanna) రెండో పార్ట్‌లోనూ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోనున్నారు. తాజాగా ఈ సీక్వెల్‌లో తన పాత్రపై ఆమె ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

మొదటిభాగం చివర్లో పుష్పరాజ్‌కు శ్రీవల్లితో పెళ్లి అయినట్లు చూపిన సంగతి తెలిసిందే. ఇదే మాటను రష్మిక చెప్పారు. ‘నేను రెండో పార్ట్‌లో పుష్పకు భార్యగా కనిపిస్తాను. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఈ సీక్వెల్‌ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. సుకుమార్‌ ప్రతీ సన్నివేశాన్ని పర్‌ఫెక్ట్‌గా తీస్తారు. మొదటి భాగానికి భారీ స్థాయిలో స్పందన రావడంతో రెండో పార్ట్‌పై అధిక అంచనాలు నెలకొన్నాయి. సీన్స్‌లో ఎంత బాగా నటించగలమనేది ఆర్టిస్టులపై ఆధారపడి ఉంటుంది. ‘పుష్ప 2’ విషయానికొస్తే ఒక రోజు నేను అత్యుత్తమంగా నటించానని అనిపించింది. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఒక చిత్రాన్ని ప్రారంభించినప్పటితో పోలిస్తే అది ముగిసేనాటికి మూవీ యూనిట్‌లో వారంతా మనకు బాగా దగ్గరవుతారు. నాకూ పుష్ప సమయంలోనే ఆ చిత్ర యూనిట్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. సీక్వెల్‌ షూటింగ్‌ కోసం వెళ్లగానే సొంత ఇంటికి వెళ్లినట్లు అనిపించింది’ అని చెప్పారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

‘హనుమాన్‌’ క్లైమాక్స్‌కు మించి ‘జై హనుమాన్’ ఉంటుంది: ప్రశాంత్‌ వర్మ

ఇక టోక్యోలో జరగనున్న క్రంచీ రోల్‌ అనిమే అవార్డుల వేడకకు హాజరయ్యేందుకు రష్మిక జపాన్‌ వెళ్లారు. ఈ వేడుకల గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఈ ఈవెంట్ కోసం, ఇక్కడి వారందరినీ కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ వేడుకకు హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు సహజంగానే బిడియం ఎక్కువ. ఇప్పుడు అది ఇంకాస్త ఎక్కువైంది. ఆ వేడుకలో నన్ను ఎవరు పలకరించినా.. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ సంభాషణ మొదలుపెడతాను’ అంటూ రష్మిక సరదాగా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని