Rashmika: నా చిన్నప్పటి కల ఇప్పుడు నెరవేరింది: రష్మిక

జపాన్‌ తనకెంతో నచ్చిందన్నారు రష్మిక. అక్కడి అభిమానులు చూపించిన ప్రేమకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.

Updated : 03 Mar 2024 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యోలో జరిగిన ‘క్రంచీ రోల్‌ అనిమే’ అవార్డుల వేడుకలో రష్మిక మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జపాన్‌లోని అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ‘జపాన్‌ రావాలని నా చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. అది ఇలా సాధ్యమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అనిమే ప్రపంచంలోని సృష్టికర్తల్లో ఒకరికి అవార్డును అందించే అవకాశం లభించింది. ఈ ఈవెంట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఎంతోమందిని కలుసుకోవడం.. అభిమానుల ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నా. ఇకపై ప్రతి ఏడాది ఇక్కడికి వస్తాను’ అంటూ ఆ దేశంపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు.

ఒకే వేదికపై జాన్వీ - ఖుషీ డ్యాన్స్.. నెటిజన్ల రియాక్షనిదే

ప్రస్తుతం రష్మిక ‘పుష్ప2’లో నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ (Allu Arjun)- సుకుమార్‌ కాంబోలో రానున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. దీని షూటింగ్‌ రామెజీ ఫిల్మ్‌ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ.. ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీనితో పాటు ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రాలతోనూ ఆమె అలరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని