Rashmika: గీతాంజలి పాత్ర నాకెంతో నచ్చింది.. ‘యానిమల్‌’ సక్సెస్‌పై స్పందించిన రష్మిక

‘యానిమల్‌’లో గీతాంజలి పాత్ర తనకెంతో నచ్చిందని రష్మిక అన్నారు. ఈ సినిమా విజయంపై ఆమె స్పందించారు.

Published : 08 Dec 2023 20:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెరీర్‌ పరంగా జోష్‌ మీద ఉన్నారు నటి రష్మిక (Rashmika). ఆమె తాజా చిత్రం ‘యానిమల్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సందీప్ వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటించిన ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మిక అలరించారు. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమె నటనను ప్రశంసిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రణ్‌బీర్‌-రష్మిక కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వీళ్లిద్దరి పేరు కలిసి వచ్చేలా ‘#RaRa’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొన్ని పోస్టులు కూడా ఎక్స్‌లో సందడి చేస్తున్నాయి. తాజాగా ‘యానిమల్‌’ విజయంపై రష్మిక మాట్లాడారు.

‘‘యానిమల్‌’ విడుదలైన రోజు నుంచి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. మీ అందరి ప్రేమాభిమానాలు చూస్తుంటే వర్ణించలేనంత ఆనందంగా ఉంది. ఒక నటిగా నాకు గీతాంజలి పాత్ర ఎంతో నచ్చింది. గీతాంజలి ధైర్యం నిజంగా ప్రశంసనీయం. ఆ పాత్రలో నటించిన ప్రతి సన్నివేశాన్నీ నేను ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా షూటింగ్‌లో చిత్రబృందంతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి’ అని తెలిపారు. ఇక రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రష్మిక ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘యానిమల్‌’లో ఆమె నటనను ప్రశంసిస్తూ రాహుల్ రవీంద్రన్ కూడా పోస్ట్‌ పెట్టారు. దీనికి రిప్లై ఇచ్చిన రష్మిక ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఇదే స్థాయిలో ఆదరిస్తారని అన్నారు.

యానిమల్‌ మైండ్‌ బ్లోయింగ్‌ మూవీ.. మెచ్చుకున్న అల్లు అర్జున్‌

ప్రస్తుతం రష్మిక ‘పుష్ప-2’ (Pushpa2)లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. దీనితో పాటు శాంతరూబన్ దర్శకత్వంలో ‘రెయిన్‌ బో’ అనే లేడీ ఓరియెంటెడ్‌ సినిమానూ రష్మిక చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని