Raviteja: రవితేజ కొత్త చిత్రం.. టైటిల్‌ ఏంటో తెలుసా..?

రవితేజ (Ravi Teja) కొత్త సినిమా టైటిల్‌ రివీల్‌ అయ్యింది. ఈ మేరకు చిత్రబృందం టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.

Published : 17 Dec 2023 13:59 IST

హైదరాబాద్‌: రవితేజ (Raviteja) - హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘మిస్టర్‌ బచ్చన్‌’ అనే పేరు ఫిక్స్‌ చేసింది. ‘నామ్‌ తో సునా హోగా’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. దీనిపై ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్‌ బాగుంది అంటూ టీమ్‌కు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. ఇక అమితాబ్ బచ్చన్‌కు రవితేజ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. పలు చిత్రాల్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. మరోవైపు ఈ సినిమా పూజా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

హరీశ్‌ శంకర్‌ - రవితేజ మూవీ.. కథానాయికగా ‘క్యాడ్‌బరీ’ బ్యూటీ..!

‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ తర్వాత హరీశ్‌ శంకర్‌ - రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని