Robinhood: ‘రాబిన్‌హుడ్‌’ నుంచి డేవిడ్‌ వార్నర్‌ లుక్‌ రిలీజ్‌

Eenadu icon
By Entertainment Team Published : 15 Mar 2025 12:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ (Nithiin) హీరోగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్‌’ (Robinhood). శ్రీలీల కథానాయిక. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా టీమ్‌ ఈ సినిమాలోని వార్నర్‌ (David Warner) లుక్‌ను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఆ లుక్‌ అటు క్రికెట్‌ అభిమానులను, ఇటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

వార్నర్‌ ఫొటో షేర్‌ చేసిన టీమ్‌ అతడికి ఇండస్ట్రీలోకి స్వాగతం పలికింది. ‘ఫ్రమ్‌ బౌండరీ టూ బాక్సాఫీస్‌’ అంటూ వార్నర్‌కు వెల్‌కమ్ చెప్పింది. ఇక ఈ సినిమా ప్రచారంలోనూ వార్నర్‌ పాల్గొంటారని ఇటీవల వెంకీ కుడుముల వెల్లడించారు. పలువురు తెలుగు సినిమా హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ డేవిడ్‌ వార్నర్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి.. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘డీజే టిల్లు’ లాంటి ఫేమస్‌ క్యారెక్టర్లలో ఆయన ఫన్నీ వీడియోలు చేసి సినీ ప్రియులకు కూడా చేరువయ్యారు. ఇప్పుడు ‘రాబిన్‌ హుడ్‌’తో తెరపై సందడి చేయనున్నారు.

‘భీష్మ’ తర్వాత నితిన్ (Nithiin)- వెంకీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే ‘రాబిన్‌హుడ్‌’. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో టీమ్‌ ప్రచారం జోరు పెంచింది. అన్ని ప్రముఖ నగరాల్లోనూ మీడియా సమావేశాలను నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు