Movies postponed: సెప్టెంబర్‌ 28.. వెనక్కి వెళ్లిన మరో రెండు సినిమాలు!

సెప్టెంబర్‌ 28న విడుదలకానున్న మరో రెండు సినిమాలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

Published : 12 Sep 2023 12:51 IST

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 28 (September 28th).. ప్రభాస్  ‘సలార్‌’ను (Salaar) ఈ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం దాదాపు ఏడాది ముందే ప్రకించింది. దీంతో ఈ రిలీజ్ డేట్‌తో కొన్నివేల పోస్టులు దర్శనిమిచ్చాయి. ఇక ‘సలార్‌’ ఈ తేదీన రావడం కష్టమే అని వార్తలు వచ్చిన నేపథ్యంలో కొన్ని చిన్న సినిమాలు ఈ తేదీని లాక్ చేసుకున్నాయి. అయితే.. తాజాగా వాటిలో రెండు సినిమాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’(Rules Ranjan). ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే.. తాజాగా విడుదల వాయిదా పడింది. అక్బోబర్‌ 6న వస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ప్రేమ, హాస్యం ప్రధానంగా ఈ చిత్రం రూపొందింది. అలాగే, నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌ ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్‌’ (MAD). ఈ చిత్రం కూడా సెప్టెంబర్‌28న రావడం లేదని తెలుస్తోంది. మొదట సెప్టెంబర్‌1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. కానీ ఆ తేదీని మారుస్తూ.. ఈ నెల 28న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రంలోని తొలిపాట ప్రోమోను విడుదల చేశారు. అందులో విడుదల తేదీ లేకపోవడంతో కొందరు నెటిజన్లు ఈ చిత్రం వాయిదా వేశారని కామెంట్స్‌ చేస్తున్నారు. 

మహేశ్‌ బాబుతో సినిమా తీసి ఆ బాకీ తీర్చుకుంటా..: ఎస్‌.జె. సూర్య

ప్రస్తుతానికి సెప్టెంబర్‌ 28న రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్కంద’ (Skanda).. ఈ తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రం కూడా మొదటి విడుదల తేదీని మార్చుకుని సలార్‌ వాయిదా వార్తల నేపథ్యంలో సెప్టెంబర్‌ 28న రానుంది. అలాగే రాఘవా లారెన్స్‌, కంగనారనౌత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన  ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) కూడా ఇదే తేదీన పలకరించనుంది. ఇక శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు’ చిత్రం సెప్టెంబర్‌ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విరాట్‌ కృష్ణ హీరోగా నటించారు. ఇక మరోవైపు ‘సలార్‌’ విడుదల వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని