Pawan Kalyan: పవన్‌ను ఎత్తుకున్న సాయి ధరమ్‌ తేజ్‌.. వీడియో వైరల్‌

తన మేనమామ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను విజయోత్సాహంతో హగ్‌ చేసుకున్నారు నటుడు సాయి ధరమ్‌తేజ్‌.

Published : 04 Jun 2024 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఎన్నికల్లో విజయం సాధించడంతో కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. కొందరు నేరుగా, మరికొందరు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పవన్‌ మంగళగిరి వెళ్లారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్‌తేజ్‌ (Sai Dharam Tej), తనయుడు అకీరా నందన్‌ (Akira Nandan) ఉన్నారు. అక్కడికి చేరుకున్నాక సాయితేజ్‌ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను హగ్‌ చేసుకుని, అనంతరం ఎత్తుకున్నారు. సంబంధిత విజువల్స్‌ను పంచుకుంటూ ‘‘మీ గెలుపే మా పొగరు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నా హీరో, గురువు’’ అని ఆయనపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

నా హృదయం ఉప్పొంగుతోంది: చిరంజీవి ఆనందం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని